A medical team outside isolation ward for coronavirus patients (Photo Credits: IANS)

New Delhi, April 11: దేశంలో కరోనా మహమ్మారికి (Coronavirus in India) బలైన వారి సంఖ్య 239కి చేరుకుంది. దాదాపు 7447 మంది వైరస్‌ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 643 మందికి జబ్బు నయమైందని తెలిపింది. గురువారం సాయంత్రం నుంచి కేవలం 24 గంటల్లోనే దాదాపు 40 మంది కోవిడ్‌ 19 కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ వివరించింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్- 19 కేసులు

తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు (Coronavirus Outbreak in India) నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 896 కేసులు, 40 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 వేల 447కి చేరింది. ఇందులో 6వేల 565 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 239మంది మరణించారు. 643 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే... ఇప్పటివరకు దేశంలో నిన్న నమోదైన కేసులే అత్యధికమని ఆరోగ్యశాఖ (Health Ministry) వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో కరోనా కలవరం, 12 గంట‌ల్లో 547 క‌రోనా పాజిటివ్ కేసులు

ఇప్పటివరకూ మహారాష్ట్రలో (Maharashtra) 110 మంది కోవిడ్‌–19కి బలికాగా, గుజరాత్‌లో 17 మంది, మధ్యప్రదేశ్‌లో 16 మంది, ఢిల్లీలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్, తమిళనాడులలో ఎనిమిది మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటకల్లో ఐదుగురు చొప్పున కోవిడ్‌కు బలయ్యారు. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లలో నలుగురు చొప్పున, హరియాణా, రాజస్తాన్‌లలో ముగ్గురు చొప్పున బలయ్యారు. కేరళ, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఇద్దరు చొప్పున, ఒడిశా, జార్ఖండ్‌లలో ఒకొక్కరు ప్రాణాలొదిలారు. దేశం మొత్తమ్మీద వైరస్‌ బారిన పడ్డ 6,761 మందిలో 71 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం సాయంత్రానికి వైరస్‌తో 169 మంది మరణించారు.

కరోనాతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు

మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు అక్కడ నమోదవుతున్నాయి. ఏరోజుకారోజు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అదుపులోకి రావడంలేదు. తాజాగా అక్కడ రెండు వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1574కు పెరిగింది. నిన్న మరో 13మంది మృతిచెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం మృతుల సంఖ్య 110కి చేరింది. ఇప్పటివరకు 188మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా... ప్రస్తుతం 1276 మంది చికిత్స తీసుకుంటున్నారు.

146 ప్రభుత్వ ప్రయోగశాలలు మరియు 16000 కంటే ఎక్కువ సేకరణ కేంద్రాలతో 67 ప్రైవేట్ ప్రయోగశాలల ద్వారా కరోనా పరీక్ష సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వేగవంతమైన డయాగ్నొస్టిక్ కిట్లు మంజూరు చేయబడ్డాయి. వాటి ఉపయోగం కోసం మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. అలాగే ఇప్పటికే ఆర్డర్లు ఇవ్వబడ్డాయనా మంత్రిత్వ శాఖ తెలిపింది.