 
                                                                 Amaravati, April 13: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరుకుంది. నిన్నరాత్రి 09 గంటల నుంచి ఇవాళ ఉదయం 09 గంటల వరకూ కొత్తగా 12 కేసులు (positive coronavirus cases) నమోదైనట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన
గుంటూరులో కొత్తగా 08 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో 02, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం (AP Govt) నుంచి 119 బులెటిన్‌లు వెలువడ్డాయి.
అయితే ఇప్పటి వరకూ గుంటూరులో 90 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మాత్రం రోజుకు రోజుకూ కరోనా మహమ్మారి ప్రబలుతోంది. కర్నూలు జిల్లాలో 84, నెల్లూరులో 52, ప్రకాశం 41, కృష్ణా జిల్లాలో 36, కడపలో 31 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
ఇదిలా ఉంటే.. 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఏడుగురు మరణించారు. అనంతపురంలో 02, కృష్ణ 02, గుంటూరు 02, కర్నూల్‌లో ఒకరు మృతి చెందారు. ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 413గా ఉంది.
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు
కాగా కోవిడ్–19 (COVID-19) వ్యాప్తి నివారణలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు, పొగాకేతర ఉత్పత్తులు, ఖైనీ వంటి ఉత్పత్తులు నమిలి ఉమ్మివేయడంపై నిషేధం విధించింది.
Here's AP corona Report
#CovidUpdates: 12 new cases reported in the state; Guntur 8, Chittoor 2, Krisha 1, West Godavari 1. Total number of cases in the state increased to 432. #ApFightsCorona #COVID19
— ArogyaAndhra (@ArogyaAndhra) April 13, 2020
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
కోవిడ్–19 నివారణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలంటూ ఐసీఎంఆర్ (ICMR) కేంద్రానికి లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు
ఏపీలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందని.. వీలైనంత త్వరగా పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు.
నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్
ఈ నెల 14తో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇంకా దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మూడు జోన్లగా విభజించి లాక్ డౌన్ విధించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
