PM Modi To Adress Nation: లాక్‌డౌన్‌ పొడిగింపుపై వీడనున్న సస్పెన్స్, జాతినుద్దేశించి రేపు ప్రసగించనున్న ప్రధాని మోదీ, ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగించిన కొన్ని రాష్ట్రాలు
PM Modi addressing NCC rally | (Photo Credits: ANI)

New Delhi, April 13: భారత ప్రధాని నరేంద్ర మోదీ (India PM Narendra Modi) రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తిపై విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) గడువు మంగళవారంతో ముగియనుండటంతో దాని కొనసాగింపుపై (Lockdown Suspense) ప్రధాని స్పష్టతనివ్వనున్నారు. కాగా దేశంలో కోవిడ్ 19 కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.

కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన

ఇప్పటికే ఒడిశా, పంజాబ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాఫ్ట్రాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగించాయి. దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 24న దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్‌లు‌గా విభజించి, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే ఆంక్షలు పరిమితం చేయాలని ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు

దేశంలో నమోదైన కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్‌ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్‌-19ను సమర్ధంగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది. లాక్‌డౌన్‌ కొనసాగితే ఆంక్షల నుంచి ఏయే రంగాలను మినహాయించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ ఒక జాబితా రూపొందిస్తోంది.

భారతదేశంలో 9,152కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

వ్యక్తిగత దూరాన్ని కచ్చితంగా పాటించే నిబంధనతో వ్యవసాయ, చిన్న-మధ్య తరహా, మౌలిక వసతుల రంగాలకు సంబంధించి కొన్ని ఆంక్షలను మినహాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో విమానయాన రంగానికి కూడా మినహాయింపు లభించవచ్చని సమాచారం.

లాక్‌డౌన్, కత్తులతో పోలీసులపై దాడి

14 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగించే పక్షంలో నిత్యావసరాలు, మందులు ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో పనిగంటలు పెంచాలన్న యోచనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ రంగాలకు చెందిన కొన్ని పరిశ్రమల్లో కార్మిక శక్తి తక్కువగా ఉండి వాటి ఉత్పత్తులకు అధిక డిమాండ్‌ ఉన్నట్లైతే పనిగంటలను పెంచడం వల్ల ఫలితం ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.