 
                                                                 నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గురువారం రాత్రి భారత మహిళల జట్టు చరిత్ర రాసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదిస్తూ, భారత మహిళలు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (119), ఎలీస్ పెర్రీ (77), ఆష్లే గార్డ్‌నర్ (63) పరుగులతో మెరిశారు. కానీ చివరి ఓవర్లలో భారత బౌలర్లు మ్యాచ్‌ను తిరగరాసారు. శ్రీచరణి, దీప్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అమన్‌జోత్ కౌర్, రాధ, క్రాంతి చెరో వికెట్ తీశారు. లక్ష్య చేదనలో భారత్ మొదట కొంత ఒత్తిడిలో పడింది. ఓపెనర్ షఫాలీ వర్మ (10) త్వరగా అవుట్ కాగా, స్మృతి మంధాన (24) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. కానీ వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును స్థిరపరిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89)తో కలిసి 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
హర్మన్ పది ఫోర్లు, రెండు సిక్స్‌లతో జోరుగా ఆడినా సదర్లాండ్ బౌలింగ్‌లో అవుటయ్యింది. అయినా జెమీమా ఆగలేదు. ఆమె దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్)తో కలసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. చివర్లో అమన్‌జోత్ ఆఫ్‌సైడ్‌లో బౌండరీ కొట్టి విజయాన్ని ఖాయం చేసింది. జెమీమా 134 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది. భారీ ఛేదనలో జెమీమా యొక్క శాంతమైన కానీ దూకుడు ఆట భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించింది.ఇక బ్లూ మహిళలు నవంబర్ 2న జరిగే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడబోతున్నారు. దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
ఆస్ట్రేలియా స్కోరుబోర్డు: హీలీ (బి) క్రాంతి 5, లిచ్‌ఫీల్డ్ (బి) అమన్‌జోత్ 119, పెర్రీ (బి) రాధ 77, బెత్ మూనీ (సి) జెమీమా (బి) చరణి 24, సదర్లాండ్ (సి అండ్ బి) చరణి 3, గార్డ్‌నర్ (రనౌట్/క్రాంతి) 63, మెక్‌గ్రాత్ (రనౌట్/జెమీమా) 12, కిమ్ గార్త్ (రనౌట్/అమన్‌జోత్) 17, కింగ్ (సి) రిచా (బి) దీప్తి 4, మోలినెక్స్ (బి) దీప్తి 0, మేగన్ షుట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 49.5 ఓవర్లలో 338 ఆలౌట్; వికెట్ల పతనం: 1-25, 2-180, 3-220, 4-228, 5-243, 6-265, 7-331, 8-336, 9-336; బౌలింగ్: రేణుక 8-0-39-0, క్రాంతి గౌడ్ 6-0-58-1, శ్రీచరణి 10-0-49-2, దీప్తి శర్మ 9.5-0-73-2, అమన్‌జోత్ 8-0-51-1, రాధ 8-0-66-1.
భారత్ స్కోరుబోర్డు: షఫాలీ (ఎల్బీ) గార్త్ 10, మంధాన (సి) హీలీ (బి) గార్త్ 24, జెమీమా (నాటౌట్) 127, హర్మన్ (సి) గార్డ్‌నర్ (బి) సదర్లాండ్ 89, దీప్తి (రనౌట్/గార్త్) 24, రిచా (సి) గార్త్ (బి) సదర్లాండ్ 26, అమన్‌జోత్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం: 48.3 ఓవర్లలో 341/5; వికెట్ల పతనం: 1-13, 2-59, 3-226, 4-264, 5-310; బౌలింగ్: మేగన్ షుట్ 6-0-40-0, కిమ్ గార్త్ 7-0-46-2, గార్డ్‌నర్ 8-0-55-0, మోలినెక్స్ 6.3-0-44-0, సదర్లాండ్ 10-0-69-2, అలనా కింగ్ 9-0-58-0, తహిల 2-0-19-0.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
