New Delhi, April 13: గడిచిన 24 గంటల్లో 796 కొత్త కేసులు, 35 మరణాలతో భారతదేశంలో వరకు సోమవారం కరోనావైరస్ కేసుల (COVID-19 in India) సంఖ్య 9,152 కు చేరిందని, అలాగే COVID-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 308 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు 856 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు, ఇంకొకరు ఇతర దేశానికి మైగ్రేట్ అయ్యారు. ఈ లెక్కన ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,987 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి: టీఎస్ సీఎం కేసీఆర్
1,982 COVID-19 పాజిటివ్ కేసులతో మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఆదివారం కొత్తగా 221 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో నిన్న ఒక్కరోజులోనే 16 కరోనా మరణాలు నమోదవడం దేశంలోనే తొలిసారి. అలాగే పుణె నుంచి 3, నవీ ముంబై నుంచి 2 మరియు సోలాపూర్ నుంచి 1 కోవిడ్-19 కారణంగా చనిపోయారు. దీంతో మహారాష్ట్రలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 149కి చేరుకుంది. ఇందులో 91 మరణాలు ముంబై నగరం నుంచే కావడం గమనార్హం.
Here's the update:
Total number of deaths rise to 308, 35 deaths in last 24 hours; India's total number of #Coronavirus positive cases rises to 9152 (including 7987 active cases, 856 cured/discharged/migrated and 308 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/QdUXat4AMO
— ANI (@ANI) April 13, 2020
ప్రాణాంతక కోవిడ్-19ను నియంత్రించేందుకు వాక్సిన్ తయారీ జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. 40కి పైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, అయితే ఇందులో ఏదీ తదుపరి దశకు చేరుకోలేదని తెలిపింది. ఇక కోవిడ్-19 నిర్ధారణ కోసం దేశవ్యాప్తంగా 151 ప్రభుత్వ మరియు 68 ప్రైవేట్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ఐసిఎంఆర్ వెల్లడించింది.
ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలో నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో COVID-19 కేసుల సంఖ్య 5 లక్షల 50 వేలు దాటింది. ఒక్క న్యూయార్క్ నగరం నుంచే 189,020 కేసులు, 9,385 మరణాలు నమోదయ్యాయి, దీని తర్వాత న్యూజెర్సీలో 61,850 కేసులు, 2,350 మరణాలు సంభవించాయి.