సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో వన్డేలో తీవ్రమైన గాయానికి గురైన తర్వాత భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదటిసారిగా స్పందించారు. ప్లీహ (spleen) గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు వచ్చి కోలుకునే దశలో ఉన్నారని తెలిపారు. 29 ఏళ్ల ఈ స్టార్ బ్యాట్స్‌మన్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలా రాశాడు:

ఆసియా కప్ విజేతగా భారత్, ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

నేను ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నాను, ప్రతి రోజూ కాస్త కాస్త మెరుగుపడుతున్నాను. నాపై చూపిన ప్రేమ, శుభాకాంక్షలు, మద్దతు అన్నీ నాకు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. నన్ను మీ ఆలోచనల్లో ఉంచినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. కాగా సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయాస్ తీవ్రమైన గాయానికి గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన ప్లీహపై ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం.

వైద్య నిపుణుల ప్రకారం, అయ్యర్ కనీసం రెండు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండవచ్చని అంచనా. దీంతో ఆయన రాబోయే హోమ్ సిరీస్‌ మరియు ఆసియా టూర్‌లను కోల్పోయే అవకాశం ఉంది.భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో అయ్యర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు తెలుపుతున్నారు, ఇక బీసీసీఐ కూడా ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

Shreyas Iyer Shares First Post After Suffering Spleen Injury

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)