New Delhi, April 23: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో (scheduled areas) రిజర్వేషన్లు 50 శాతం మించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని (Telugu states) షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు రక్షణ ఇస్తున్నామని, ఏపీ, తెలంగాణలో ఇదేరీతిలో పునరావృతమైతే ఇప్పటివరకు జరిగిన వాటికి కూడా రక్షణ ఉండదని హెచ్చరించింది.
ఉమ్మడి ఏపీలో షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉపాధ్యాయుల పోస్టులను వందశాతం షెడ్యూల్డ్ తెగలతో భర్తీ చేయడాన్ని సవాల్ చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు, ఇతరులు 2002లో దాఖలు చేసిన సివిల్ అప్పీలును జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి బుధవారం 152 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాల సీఎంలతో ఈనెల 27న ప్రధాని 3వ సారి భేటీ, భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు
వంద శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని షెడ్యూల్డ్ ఏరియాల్లో వందశాతం రిజర్వేషన్లను కల్పిస్తూ 2000వ సంవత్సరంలో అప్పటి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సమర్ధించడం తగదని పిటిషనర్ తరపు న్యాయవాది సీఎస్ఎన్ మోహన్ రావు వాదించారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఆ జీవోను కొట్టివేసింది. వంద శాతం రిర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1986లో షెడ్యూల్డు ఏరియాలో ఉపాధ్యాయ నియామకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబరు 275 జారీచేసింది. 1989లో ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ దాన్ని రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వచ్చింది. సుప్రీం కోర్టు 1998లో దానిని కొట్టివేస్తూ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. తిరిగి జనవరి 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది.
పరిపాలన ట్రిబ్యునల్ దీనిని కొట్టివేయగా, హైకోర్టు జీవోను సమర్థించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరపున న్యాయవాది సీఎల్‌ఎన్ మోహన్‌రావు వాదనలు వినిపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపింపచారు. వాటిపై ధర్మాసనం పైవిధంగా తీర్పునిచ్చింది. నాటి నియామకాల్లో ఎలాంటి జోక్యం చేసుకోమని ఏపీ తెలంగాణలో భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని పరిమితికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఒకవేళ రిజర్వేషన్ల పరిమితిని అతిక్రమిస్తే 1986 నుంచి ఇప్పటిదాకా చేసిన నియామకాలను కాపాడలేమని చెప్పింది. కేసు ఖర్చుల కింద రూ.5 లక్షలు చెల్లించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఈ మొత్తాలను చెరిసగం భరించాలని ఆదేశించింది.