AP Coronavirus: బ్ర‌హ్మంగారి ఆరాధ‌న ఉత్స‌వాలు ర‌ద్దు, ఏపీలో తాజాగా 73 కరోనా కేసులు, మొత్తంగా 1014 యాక్టివ్‌ కేసులు, రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు
Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, April 29: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 73 కరోనా పాజిటివ్‌ కేసులు (AP positive cases) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. బుధవారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1332 కు చేరిందని వెల్లడించింది. తాజాగా 29 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 287కు చేరుకుంది. 3వ విడత ఉచిత రేషన్ ప్రారంభం, బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ది, కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి

వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1014 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదల చేసింది.

Here's AP Coronavirus Report

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బ్ర‌హ్మంగారి మ‌ఠంలో నేటి నుంచి జ‌ర‌గాల్సిన ఆరాధ‌న ఉత్స‌వాలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆల‌యాధికారులు ప్ర‌క‌టించారు. సాధార‌ణంగా అయితే బ్రహ్మంగారిమఠం మండలంలో ఏప్రిల్ 29 నుంచి మే 4 వ‌ర‌కు ఉత్స‌వాలు నిర్ణ‌యించారు. ఇందులో మే 2న బ్ర‌హ్మంగారు స‌జీవ స‌మాధి నిష్ట వ‌హించిన రోజు కాగా 3న ర‌థోత్స‌వం నిర్వ‌హించాల్సి ఉంది. ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ

ప్ర‌స్తుతం ఏర్ప‌డ్డ విష‌మ ప‌రిస్థితుల దృష్ట్యా వీటిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకున్నారు. కావున‌, భ‌క్తులెవ‌రూ ఉత్స‌వాల‌కు రావ‌ద్ద‌ని మ‌ఠం పీఠాధిప‌తి శ్రీ వసంతి వెంక‌టేశ్వ‌ర‌స్వామి, ఆల‌య మేనేజ‌ర్ ఈశ్వ‌రాచారి కోరారు. వణికిస్తున్న ముంబై మురికివాడ ధారావి, కొత్తగా 42 పాజిటివ్ కేసులు, ఇండియాలో 31 వేలకు పైగా కోవిడ్-19 కేసులు, ఇండోనేషియాకు ప్రధాని మోడీ భరోసా

రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్‌ జోన్లలో పరీక్షలపై దృష్టి సారించిన అధికారులు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,334 కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించామని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,504 చొప్పున పరీక్షలు జరుగుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల

దేశంలోనే అత్యధిక సగటుతో పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, పంటల మార్కెటింగ్, రొయ్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.