Mahashivratri Celebrations 2024: అంతటా శివోహం.. శివన్నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Mahashivratri Celebrations 2024 (Credits: X)

Newdelhi, Mar 8: తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు దేశవ్యాప్తంగా శివాలయాల్లో (Lord Shiva Temples) మహాశివరాత్రి వేడుకలు (Mahashivratri Celebrations 2024) ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.

Andhra Pradesh Elections 2024: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, అధికారికంగా ప్రకటించిన సీఎం జగన్ టీం

తెలంగాణలో ఇలా..

తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. వరంగల్‌ లోని ప్రసిద్ధ ఆలయమైన వేయిస్తంభాల గుడిలో పునర్మిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో పూజలు చేశారు. అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. పానగల్లులోని ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

HC on Ration Card: రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదు, ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, అది ప్రజాపంపిణీ కోసమేనని స్పష్టం చేసిన ధర్మాసనం

ఏపీలో అలా..

ఏపీలోనూ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, మహానంది ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో అర్థరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చి ముక్కంటి దర్శనం చేసుకుంటున్నారు. లేపాక్షిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని నేడు శివపార్వతుల కళ్యాణోత్సవం, రుద్ర హోమం, దీపోత్సవం నిర్వహించనున్నారు. రాజమండ్రిలో గోదావరి స్థాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

దేశంలో వేడుకలు

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శైవాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు.. పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళ్ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement