Amit Shah In Hyderabad: నేడు హైదరాబాద్ కు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.

కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించబోతున్నారు. తుక్కుగూడలో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొనడం కోసం ఆయన నగరానికి వస్తున్నారు.

Union Home Minister Amit Shah | File Image | (Photo Credits: IANS)

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించబోతున్నారు. తుక్కుగూడలో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొనడం కోసం ఆయన నగరానికి వస్తున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరనున్నారు అమిత్ షా.

అమిత్ షా రాకపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత కూడా అమిత్ షా పర్యటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్: రూ. 1350 కోట్లు, GST పరిహారం: రూ. 2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటని, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏమిటని కవిత ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై సమాధానం చెప్పాలని కవిత నిలదీశారు. ఇంధనం, LPG ధరలను అధిక ధరలకు విక్రయించడంపై కూడా కవిత అమిత్ షా ను ప్రశ్నించారు.

దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై వృద్ధులు గ్యాంగ్ రేప్, రాత్రంతా రూంలో బంధించి అత్యాచారం, తెలంగాణలో షాకింగ్ ఘటన వెలుగులోకి

ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి అమిత్ షా జీ అని కవిత ట్విట్టర్ లో తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని NITI అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో కూడా చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

అమిత్ షా జీ, కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ & కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు కవిత.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement