CBN Tributes to Ramoji Rao: రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్ర‌బాబు, భార్య‌తో క‌లిసి వ‌చ్చి రామోజీ కుటుంబ స‌భ్యుల‌కు ఓదార్పు (వీడియో)

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దంపతులు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు పార్థివదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Cherukuri Ramoji Rao

Hyderabad, June 08: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దంపతులు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు పార్థివదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కాసేపు మౌనం పాటించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామోజీ రావు భార్య రమాదేవి, కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్‌, ఆయన భార్య శైలజా కిరణ్‌, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

 

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీచేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సింగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, సైబరాబాద్‌ కమిషనర్‌కు సీఎస్‌ ద్వారా ఆదేశించారు. ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు ఉంటాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement