MLC Kavitha Injured: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, దీన్‌ దయాల్ ఆస్పత్రికి తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే జైలు సిబ్బంది దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత నాలుగు నెలలుగా జైలులోనే ఉన్నారు.

BRS Leader K Kavitha (File Image)

Delhi, Jul 16: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే జైలు సిబ్బంది దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత నాలుగు నెలలుగా జైలులోనే ఉన్నారు. ఇక ఇదే కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

మార్చి 15న మద్యం కుంబకోణం కేసులో కవితను అరెస్ట్ చేశారుఈడీ అధికారులు. ఇక ఆమెను తీహార్ జైలుకు తరలించగా ఇదే కేసులో ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్ట్‌ చేసింది. కవిత పాత్రకు సంబంధించి పలు ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది సీబీఐ. మధ్యంతర బెయిల్‌ కోసం కవిత తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. తెలంగాణ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన రేవంత్...18 సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు.

Here's Tweet

విచారణ సమయంలో సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. అయితే ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని స్పష్టం చేశారు సీబీఐ తరపు న్యాయవాది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. క‌విత డిఫాల్ట్ బెయిల్‌, సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది. విచారణ సమయం దగ్గర పడుతున్న తరుణంలో కవిత అస్వస్థతకు గురయ్యారు.

Here's Tweet

 

 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Advertisement
Advertisement
Share Now
Advertisement