Hyderabad Shocker: ఓయో రూంలో బరి తెగించిన కామాంధులు, మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు యువతిపై దారుణంగా అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం జరిగింది. కొందరు దుండగులు.. అమ్మాయి(13)ని కిడ్నాప్‌ చేసి, సామూహిక లైంగిక దాడికి (Minor drugged, gang-raped) పాల్పడ్డారు. కాగా, జూబీహిల్స్‌ మైనర్‌ అత్యాచార ఘటన ఇంకా మరువకముందే ఇలా మరో ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Hyderabad, Sep 15: హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం జరిగింది. కొందరు దుండగులు.. అమ్మాయి(13)ని కిడ్నాప్‌ చేసి, సామూహిక లైంగిక దాడికి (Minor drugged, gang-raped) పాల్పడ్డారు. కాగా, జూబీహిల్స్‌ మైనర్‌ అత్యాచార ఘటన ఇంకా మరువకముందే ఇలా మరో ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దబీర్‌పురా పోలీస​్‌ స్టేషన్‌ పరిధిలో సెప్టెంబర్‌ 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఓ మైనర్‌ బాలిక మెడికల్‌ షాపునకు వెళ్లిందేకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ సమయంలో ఇద్దరు యువకులు.. బాలికను కిడ్నాప్‌ చేసి అదే ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్‌ రూమ్‌కు తరలించారు.అక్కడే రెండు రోజులు ఉంచి మత్తు మందు ఇచ్చి (Minor drugged) ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

కామవాంఛ తీరిన అనంతరం.. బాధితురాలని చాదర్‌ఘాట్‌ దగ్గర వదిలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఇంటికి తీసుకువెళ్లారు. కాగా, అత్యాచారం సందర్భంగా బాధితురాలికి మత్తు మందు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. బాధితురాలు కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను రవేష్‌ మెహదీ, మహ్మదుల్లాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు.

స్నేహితుడే అసలు సూత్రధారి, యూపీలో అక్కాచెళ్లెల్లపై అత్యాచారం, హత్య కేసులో ఆరుమంది అరెస్ట్, చెరుకుతోటకు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారని తేల్చిన పోలీసులు

నిందితులు బాలికకు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. తెలిసిన వారు కావడంతో బాలిక వారి మాటలు నమ్మి వెంట వెళ్లినట్టు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు చెప్పారు.కిడ్నాప్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ, ఓయో రూమ్‌కు తరలిస్తున్న ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, బాధితురాలు మైనర్‌ కావడంతో భరోసా సెంటర్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడే బాధితురాలు, ఆమె పేరెంట్స్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement