 
                                                                 Vijayawada, Mar 8: ఏపీలోని (AP) అన్నమయ్య జిల్లా (Annamayya Dist.) నిమ్మనపల్లె మండలంలో ఘోరం జరిగింది. పాల డిపోకు వెళ్లి పాలు పోసి వస్తున్న ఓ అమ్మాయిపై ఇద్దరు యువకులు దారుణానికి తగబడ్డారు. యువతిని అటకాయించి నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై యువతి వీడియోలో మాట్లాడారు. నిందితులను నాగేంద్ర, సురేంద్రగా యువతి పేర్కొంది. కేసు పెడితే చంపేస్తా అని నిందితులు బెదిరించినట్టు బాధితురాలు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మహిళ పై ఇద్దరు యువకులు అత్యాచారం
అన్నమయ్య నిమ్మనపల్లె మండలంలో పాల డిపోకు పాలు పోసి వస్తుండగా దారుణానికి పాల్పడ్డ ఇద్దరు యువకులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. pic.twitter.com/MEblu3iKY7
— ChotaNews App (@ChotaNewsApp) March 8, 2025
ఇదే మండలంలో మొన్న కూడా..
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలోనే ఇటీవల మరో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లుపొరలు కమ్మి చిన్నారులైన కన్న బిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. సీఐ రమేశ్‌బాబు తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి(28)కి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు ఆడపిల్లలు. అతను దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి 9, 7 ఏళ్ల వయసున్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలిసి భార్య వారించింది. అయినా భర్త ధోరణిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో కూతుళ్లపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడినట్టు తేలడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
