
Hyderabad, Mar 8: రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలు కొందరు అమ్మాయిలను వేధించడం నానాటికీ పెరిగిపోతుంది. ఎన్నిసార్లు చితక్కొట్టినా, ఎన్ని రకాలుగా హెచ్చరించినా వీళ్లలో అస్సలు మార్పు కానరావడం లేదు. ఇదీ అలాంటి ఘటనే. హైదరాబాద్ (Hyderabad) లోని సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. ఉదయం సమయంలో అమ్మాయిల ముందు ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు (Man Obscene Behaviour In Public Place). సదరు వ్యక్తి ప్రవర్తనను చూసి కాలేజీలకు, స్కూల్స్ కు వెళ్లే అమ్మాయిలు ఒకింత భయపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఆ వీడియో పోలీసుల దృష్టికి చేరడంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోన్నట్టు సమాచారం.
Here's Video:
సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్‌లో శుక్రవారం ఉదయం సమయంలో అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి
వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రయాణికులు pic.twitter.com/G4nUXdeeBx
— Telugu Scribe (@TeluguScribe) March 8, 2025
చిర్రెత్తికొచ్చి.. చితక్కొట్టి
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లోని బెకన్ గంజ్ మార్కెట్ లో కూడా వారం కిందట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బిజీ మార్కెట్లో బుర్ఖా ధరించిన మహిళ పండ్ల దుకాణం వద్ద నిలబడి ఉండటం సదరు వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ఆమె వెనుకగా వచ్చిన ఓ వ్యక్తి ఆమెను అనుచితంగా తాకేందుకు యత్నించాడు. దీంతో ఆ మహిళ పట్టరాని కోపంతో ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని చెంపపై వాయించడం కనిపిస్తుంది. ఇలా కేవలం 48 సెకన్లలోనే ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టింది. అయితే ఆమె కొట్టే దెబ్బలు తట్టుకోలేక మార్కెట్లో చోద్యం చూస్తున్న వారిని సాయం కోరగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో ఆ మహిళ కింద పడేసి చితక్కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. సదరు వ్యక్తి మార్కెట్ లో మహిళలను తరచూ వేధిస్తున్నాడని స్థానికులు పలువురు తెలిపారు.