Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్, దంచి కొడుతున్న వర్షం, అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు

భారీ వర్షం హైదరబాద్ నగరాన్ని మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.

Hyderabad Rains (Photo-Twitter)

భారీ వర్షం హైదరబాద్ నగరాన్ని మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.

భాగ్య నగరంలో చాలాచోట్ల వాన నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే భారీగా పలు రూట్‌లలో ట్రాఫిక్‌ జామ్‌ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కారిడార్‌.. హైదరాబాద్‌ శివారు అయిన సైబరాబాద్‌లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్త.. అకస్మాత్తుగా పడిన భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచన

ఐకియా నుంచి జేఎన్‌టీయూ వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు నానక్‌రామ్‌ గూడ, బయో డైవర్సిటీ రూట్‌లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌ రూట్‌లలోనూ భారీ వర్షంతో ట్రాఫిక్‌కు విఘాతం కలుగుతోంది. మరికాసేపట్లోనూ వర్షం కురవొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో.. ట్రాఫిక్‌ జామ్‌ మరింత పెరిగే అవకాశాలతో ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement