Hyderabad Shocker: పెళ్లికి ఒప్పుకోలేదని టీకి పిలిచి యువతి గొంతు కోసిన యువకుడు, ముఖం, చేతులపైనా తీవ్ర గాయాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు
హైదరాబాద్ నగరంలోని నార్సింగి పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.మహిళా సాఫ్ట వేర్ ఇంజనీర్ పెళ్లికి నిరాకరించందనే కారణంతో ఓ యువకుడు ఆమె గొంతు కోసి దారుణంగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పుప్పాలగూడ టీ గ్రిల్ హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
Man Slits Software Engineer’s Throat: హైదరాబాద్ నగరంలోని నార్సింగి పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.మహిళా సాఫ్ట వేర్ ఇంజనీర్ పెళ్లికి నిరాకరించందనే కారణంతో ఓ యువకుడు ఆమె గొంతు కోసి దారుణంగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పుప్పాలగూడ టీ గ్రిల్ హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువతి (22) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ గచ్చిబౌలిలోని హాస్టల్‌లో ఉంటోంది. ఆమె సమీప బంధువు చిలకలూరిపేటకు చెందిన కొత్త గణేష్ (27) గచ్చిబౌలిలోనే ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ యువతిని పెళ్లిచేసుకోవాలని గతంలో గణేష్ ప్రతిపాదించగా ఆమె తిరస్కరించింది.
మంగళవారం రాత్రి ఆమె హాస్టల్‌లో ఉండగా పిలిచి బైక్‌పై టీ గ్రిల్ హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. మరోసారి గణేష్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా ఆమె మళ్లీ తిరస్కరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో గణేష్ తన బ్యాగులోని కత్తి తీసి యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి గొంతుతో పాటు ముఖం, చేతులపైనా తీవ్ర గాయాలయ్యాయి. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు.
(The above story first appeared on LatestLY on Jun 21, 2023 02:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

