Representational Purpose Only (Photo Credits: Max Pixel)

Chinese Man Throws Hot Soup On Daughter-in-law: నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలు పొట్టి బట్టలు వేసుకుందని మామ ఆమెపై వేడి వేడి సూప్‌ పోసి దాడి చేశాడు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, జు ఇంటిపేరుతో ఒక చైనీస్ మహిళ, హాట్ ప్యాంటు ధరించినందుకు తన మామగారు తనపై దాడి చేశారని ఆరోపించారు. నివేదిక ప్రకారం, ఈ సంఘటన జూన్ 12 న జరిగింది. డైనింగ్ టేబుల్ వద్ద ఆ వ్యక్తి "అనుచితమైన" బట్టలు వేసుకున్నందుకు ఆమెను తిట్టడంతో పాటు ఆమె హాట్ ప్యాంటు "చాలా పొట్టిగా ఉంది" అంటూ చితకబాదాడు. "నీవు ఇలా బయటకు వెళితే, ఇరుగుపొరుగు వారు చూస్తారు. మా పరువు ఏం కావాలి అంటూ కోడలిపై విరుచుకుపడ్డారు.

రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళ చీరను పైకి లేపిన మందుబాబు, అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న పోలీసులు

దీనిపై కోడలు స్పందిస్తూ.. ‘నా డబ్బులతో నేను దుస్తులు కొనుకున్నాను. నాకు నచ్చినట్లు వేసుకుంటాను’ అని సమాధానం చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె మామయ్యకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.కోడలు ముఖంపై వేడి సూప్ గిన్నెను విసిరాడు. అంతటితో ఆగకుండా ఈ గొడవను పెద్దది చేస్తూ ఆమె జుట్టు పట్టుకొని లాగి ‘ నేను నిన్ను ఈరోజు చంపేస్తాను’ అంటూ బెదిరించాడు.

ఇంతలో అక్కడికి వచ్చిన మహిళ కొడుకు.. తల్లిని రక్షించేందుకు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లి తాళం వేశాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుకుంది. వారు ఇంటికి చేరుకొని మహిళ దుస్తుల వల్ల ఎవరికి ఏ నష్టం లేదని దుస్తుల పేరుతో ఆమెను వేధించడం మానేయాలని మామను హెచ్చరించారు. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు.

దారుణం, యూపీలో దళితుడి ప్రైవేట్ భాగాలను కోసేసిన అగ్రవర్ణ వ్యక్తులు, అడ్డువచ్చిన భార్యపై గొడ్డలితో దాడి, వీడియో ఇదిగో..

మామ వేధింపుల గురించి భర్తకు తెలియజేయగా అతను సైతం తండ్రి వైపే నిలిచాడు. అలాంటి దుస్తులు ధరించవద్దని భార్యను వారించాడు. తనకు అండగా ఉంటాడనున్న భర్త సైతం తండ్రి వైఖరితోనే ఉండటంతో తాను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది.ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో ఆమె ముఖంపై గాయాలు, మచ్చలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే మామ ఆమెను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మామ ప్రవర్తనపై మండిపడుతున్నారు.