Maoists Killed Two Men: ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య.. మృతుల్లో పంచాయతీ కార్యదర్శి కూడా

ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్‌ ఫార్మర్లనే నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు.

Maoists Killed Two Men (Credits: X)

Mulugu, Nov 22: ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలం జంగాలపల్లిలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్‌ ఫార్మర్లనే నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతులను ఉయిక రమేశ్‌, ఉయిక అర్జున్‌ గా పోలీసులు గుర్తించారు. రమేశ్‌ పంచాయతి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. హత్య అనంతరం వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఆ ప్రాంతంలో ఓ లేఖ వదిలివెళ్లారు. మృతులను పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేందంటూ, ఈ క్రమంలోనే హత్య చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరై ఉంటారని పోలీసులు ఆరాతీస్తున్నారు. మావోయిస్టులు నేరుగా పాల్గొన్నారా లేదా సానుభూతిపరులా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్

జంట హత్యలతో ఏజెన్సీలో మళ్లీ అలజడి నెలకొంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీలో ఇన్‌ ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల దుశ్చర్యతో తెలంగాణ-ఛత్తీస్‌ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement