Kaushik Reddy Apology to Governor: సారీ మేడమ్, నన్ను క్షమించండీ! తెలంగాణ గవర్నర్‌కు లేఖ రాయనున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, వివాదాస్పద వ్యాఖ్యలపై తప్పు ఒప్పుకున్న బీఆర్‌ఎస్ నేత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (MLC Kaushik Reddy) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను క్షమాపణలు కోరనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరిపింది. కౌశిక్ రెడ్డి విచారణకి హాజరై క్షమాపణలు చెప్పినట్లు (Kaushik Reddy Apology to Governor) కమిషన్ తెలిపింది.

Kaushik Reddy Apology to Governor (PIC @ Twitter)

Hyderabad, FEB 22: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (MLC Kaushik Reddy) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను క్షమాపణలు కోరనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరిపింది. కౌశిక్ రెడ్డి విచారణకి హాజరై క్షమాపణలు చెప్పినట్లు (Kaushik Reddy Apology to Governor) కమిషన్ తెలిపింది. అలాగే, గవర్నర్ కి కూడా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. దీంతో ఈ వివాదానికి తెరదించాలని కౌశిక్ రెడ్డి నిర్ణయించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నోరు జారారు. గవర్నర్ ను ఉద్దేశించిన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం ఏకంగా జాతీయ మహిళా కమిషన్ (NCW) దృష్టికి వెళ్లింది. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్.. కౌశిక్ రెడ్డిపై సీరియస్ అయ్యింది. విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివి, వీడ్కోలు సభలో బిశ్వభూషణ్ హరిచందన్‌ను కొనియాడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై (Governor Tamilisai) కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్ మంగళవారం ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు రాకపోతే తదుపరి చర్యలుంటాయని హెచ్చరించింది. జాతీయ మహిళా కమిషన్ కార్యదర్శి బర్నాలీ షోమే ఈ నెల 14నే ఈ నోటీసులు జారీ చేశారు.

Telangana: బీజేపీ నేత మురళీకృష్ణగౌడ్ ఇంటిపై దాడి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులు పనేనంటున్న బీజేపీ నేతలు, పరిగి సబ్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన బీజేపీ నాయకుడు 

గత నెల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెపుతూ అసభ్య పదజాలం ఉపయోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గవర్నర్ పై కౌశిక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. కౌశిక్ వ్యాఖ్యలు గవర్నర్ ప్రతిష్ట, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి.. కమిషన్ కు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే గవర్నర్ ను కూడా క్షమాపణలను కోరనున్నట్లు కమిషన్ కు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement