Hyderabad Shocker: పసికందును పై అంతస్తు నుంచి పడేసి పారిపోయిన తల్లిదండ్రులు, చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన ఎస్సై, స్వయంగా ఆస్పత్రికి తరలించి చికిత్స, కుషాయిగూడలో కిరాతక పేరెంట్స్
అపార్ట్ మెంట్ లోని అంతస్తు నుంచి కిందకు ఒక్కసారిగా పడేయటంతో సిమెంట్ గచ్చుకు బలంగా తగలడంతో గుక్కపెట్టి ఏడ్చిన పసికందును చూసి చలించిపోయారు అపార్ట్ మెంట్ వాసులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 108 కు ఫోన్ చేసి అపార్ట్ మెంట్ కు చేరుకున్న కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్.. ప్రాణాలతో ఉన్న పసికందును చూసి చలించిపోయారు.
Hyderabad, DEC 18: హైదరాబాద్ కుషాయిగూడలో (Kushaiguda) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మాతృత్వానికే మచ్చ తెచ్చే దారుణం ఇది. నవమోసాలు మోసి శిశువును కన్న ఆ తల్లి పసికందును వద్దనుకుంది. లోకం పోకడ తెలియని ఆ పసికందును (abandoned infant) నిర్దాక్షిణ్యంగా ఓ అపార్ట్ మెంట్ ఆవరణలో పడేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడ ఏరియా కమలానగర్ లో (Kamalanagar) జరిగింది. అపార్ట్ మెంట్ లోని అంతస్తు నుంచి కిందకు ఒక్కసారిగా పడేయటంతో సిమెంట్ గచ్చుకు బలంగా తగలడంతో గుక్కపెట్టి ఏడ్చిన పసికందును చూసి చలించిపోయారు అపార్ట్ మెంట్ వాసులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 108 కు ఫోన్ చేసి అపార్ట్ మెంట్ కు చేరుకున్న కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్.. ప్రాణాలతో ఉన్న పసికందును చూసి చలించిపోయారు. ఆ పసికందును చేతుల్లోకి తీసుకుని అంబులెన్స్ లోకి ఎక్కించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
గాయాలైన పసికందుకు ప్రాథమిక చికిత్స చేశాక మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి (Niloufer Hospital) తరలించారు. ప్రాణాలతో ఉన్న పసికందును నిర్దాక్షిణ్యంగా అపార్ట్ మెంట్ నుంచి విసిరేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాళ్లసలు తల్లిదండ్రులేనా? అని స్థానికులు మండిపడుతున్నారు.
లోకం పోకడ ఎరుగని పసికందును అలా ఎలా విసిరేశారో అర్థం కావడం లేదంటున్నారు. ఆ కసాయి తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పసికందును విసిరేసిన తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు విసిరేశారు? కారణం ఏంటి? ఎందుకింత నిర్దయగా వ్యవహరించారు? అని తెలుసుకునే పనిలో పడ్డారు.
(The above story first appeared on LatestLY on Dec 18, 2022 11:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

