Hyderabad, DEC 18: ఫోన్ లేకుండా ప్రస్తుతం రోజు గడవడం లేదు. ప్రతి పది నిమిషాలు ఒకసారైనా ఫోన్ చెక్ (Mobile) చేసుకుంటుంటాం. అయితే అవసరమైన దానికి, అవసరం లేని దానికి ఫోన్ పట్టుకుంటే పిల్లలపై తల్లిదండ్రులు కోప్పడటం మామూలు విషయమే. కొందరు ఫోన్ వాడొద్దని (Mobile Using) పిల్లలను భయపెడతారు, బుజ్జగిస్తారు. కానీ హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన కూతుర్ని ఏకంగా గొంతునులిమి చంపేశాడు (kills daughter). ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతోందని కోపోద్రిక్తుడైన వ్యక్తి...ఆమెను హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ముషీరాబాద్ ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..... బాకారంలో 17 ఏళ్ల యాస్మిన్ ఉన్నిసా అనే యువతి రాత్రి వేళ ఫోన్ అధికంగా మాట్లాడుతున్నారు. అయితే ఫోన్ మాట్లాడటం తగ్గించుకోవాలని తండ్రి మహమ్మద్ తౌఫీ ఆమెకు సూచించారు.
Anna Canteen Torched: తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు.. అర్ధరాత్రి నిప్పు పెట్టి పరారైన దుండగులు
కానీ ఆ యువతి తండ్రి మాటలను పట్టించుకోలేదు. ఎంత చెప్పినా వినకుండా ఫోన్ లో అలాగే మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన తండ్రి ఆదివారం ఉదయం కుమార్తె గొంతు నులిమి చంపేశారు. అనంతరం తండ్రి మహమ్మద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.