Tenali, Dec 18: ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం (TDP Government) ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను (Anna Canteen) ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మూసివేసింది. మరింత మెరుగ్గా వాటిని నిర్వహిస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో అన్నా క్యాంటీన్లు అన్నీ మూతపడ్డాయి. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలంటూ ప్రతిపక్ష నేతలు (Opposition Parties) పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. అయినప్పటికీ వాటికి మోక్షం దక్కలేదు.
తాజాగా, గుంటూరు జిల్లా తెనాలిలో అలా మూతపడిన ఓ అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దుండగులు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌కు నిప్పు పెట్టిన దుండగులు https://t.co/veYWu5GNsO #Tenali #Guntur #AndhraPradesh #AnnaCanteen #CaughtFire
— hmtv News (@hmtvnewslive) December 18, 2022
Honorable @HMOIndia Shri @AmitShah @AmitShahOffice ji @BJP4India law & order in AP. Shameful to @dgpapofficial @AndhraPradeshCM on political riots in AP. This is burning “Anna Canteen”. In Tenali constituency. @JaiTDP @iTDP_Official need to protect.
— Krishna Ghanta (@KrishnaGhanta11) December 18, 2022