Credits: Google

Hyderabad, Dec 18: విద్యాసంస్థల్లో (Educational Institutions) బాలికల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం (Government) ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల హైదరాబాదులోని (Hyderabad) డీఏవీ స్కూలులో చిన్నారిపై లైంగికదాడి జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చట్టం (Special Law) తీసుకురానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడారు.

‘నన్ను చంపేయ్.. బతికొచ్చి నీ బాధలు తీరుస్తా!’ నమ్మబలికిన ఫ్రెండ్.. అలాగే చేసి జైలుపాలైన స్నేహితుడు

అమ్మాయిలపై ఏదైనా ఘటన జరిగితే సదరు స్కూలు, కాలేజీ యాజమాన్యాలను బాధ్యులను చేయడం ఈ చట్టంతో సాధ్యమవుతుందని వివరించారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చిన్నారులపై, యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చట్టంతో మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. కాగా, స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థినుల భద్రతకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు.. అర్ధరాత్రి నిప్పు పెట్టి పరారైన దుండగులు