Telangana Horror: మెదక్ జిల్లాలో దారుణం, దిష్టి తీసి ఆ వస్తువులను రోడ్డు మీద వేశారని ముగ్గురిపై గ్రామస్తులు విచక్షణారహితంగా దాడి, ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

తెలంగాణ మెదక్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో రాములు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మహిళలపై గ్రామస్తుల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాములు మృతి చెందగా మరో ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Man beaten to death on suspicion of performing black magic in Medak (Photo-X/ ManaTeluguPrajalu)

Hyd, Sep 4:  తెలంగాణ మెదక్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో రాములు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మహిళలపై గ్రామస్తుల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాములు మృతి చెందగా మరో ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఏఎస్సై దయానంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం మందాపూర్‌ గ్రామానికి చెందిన దేవునికాడి రాములు(65)కు విరేచనాలు అవుతుండటంతో టేక్మాల్‌ పీహెచ్‌సీ, బొడ్మట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున పరిచయస్తురాలు బాలమణి రాములుకు దిష్టి తీసి ఆ వస్తువులను రోడ్డు వద్ద ఉంచారు.  వీడియో ఇదిగో, వృద్ధురాలిని కొమ్ములతో అమాంతం ఎత్తేసిన ఎద్దు, గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టిన బాధితురాలు

ఇది గమనించిన కొందరు గ్రామస్థులు కోపోద్రిక్తులై వారిద్దరితోపాటు మరో మహిళను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఆపై ఊరి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంతో ముగ్గురూ గాయాలతో జోరువానలో శివారులోని ఓ చెట్టు కిందకు చేరారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అప్పటికే మృతి చెందగా.. మహిళలిద్దరూ చికిత్స పొందుతున్నారు. అతని కుమారుడు శివకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement