Bandi Sanjay on KCR: సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో తాంత్రిక పూజలు, 3 నెలలకోసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు చేస్తున్నారని ఆరోపణ, ఫామ్‌హౌజ్‌లో తాంత్రిక పూజలు చేసి ద్రవాలు కాళేశ్వరంలో కలిపారన్న బండి సంజయ్, టీఆర్‌ఎస్ పేరు మార్పుకు ముందు తాంత్రిక పూజలు చేశారన్న బండి
టీఆర్ఎస్ (TRS) పేరు మార్పు వెనుక కుట్ర ఉందని కూడా ఆ స్వామీజీ చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు నెలలు ఒకసారి కేసీఆర్ నల్లపిల్లితో పూజలు చేస్తారని చెప్పారు.
Hyderabad, OCT 08: మునుగోడులో (Munugode) రాజగోపాల్‌రెడ్డి (Rajagopla Reffy) భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా (JP Nadda) ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు (KCR Tantrik) చేస్తున్నారని ఓ స్వామీకి తనకు చెప్పారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. టీఆర్ఎస్ (TRS) పేరు మార్పు వెనుక కుట్ర ఉందని కూడా ఆ స్వామీజీ చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు నెలలు ఒకసారి కేసీఆర్ నల్లపిల్లితో పూజలు చేస్తారని చెప్పారు. తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. మాంత్రికుడి సూచనల మేరకే పార్టీ పేరును మార్చుకున్నారని చెప్పారు. అంతేగాక, కేసీఆర్ (CM KCR) ఫాంహౌస్ లో తాంత్రిక పూజలు చేసి కొన్ని ద్రవాలను కాళేశ్వరంలో కలిపారని ఆయన అన్నారు.
మలక్‌పేట నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నేత లింగాల హరిగౌడ్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వీరికి బండి సంజయ్‌పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్ (TRS), మజ్లిస్ (MIM) కలిసి ప్రజలను రాచిరంపాన పెడుతున్నారని ధ్వజమెత్తారు. మజ్లిస్ పార్టీ నేతలు చట్టాలను గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకోవాలని, అక్రమంగా దోచుకుంటే ఈడీ లాంటి సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని సీఎం ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మోహన్ భగవత్‌పై కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అభ్యంతరం తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.