Telangana Police Recruitment: ఎత్తు తక్కువై అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ గుడ్ న్యూస్, వారికి మరో అవకాశం కల్పిస్తామని తెలిపిన TSLPRB చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
ఎత్తు కారణంగా అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Telangana Police Recruitment) మరో అవకాశం కల్పించనుంది.
Hyd, Feb 9: ఎత్తు కారణంగా అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Telangana Police Recruitment) మరో అవకాశం కల్పించనుంది.ఒక సెంటీమీటర్, ఆ లోపు తేడాతో అనర్హులైన అభ్యర్థులకు (who are disqualified by one centimeter or less) మరోమారు ఎత్తు కొలతలు తీయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు TSLPRB చైర్మన్ వీవీ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎత్తు కొలతలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్ ఈనెల 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు లాగిన్ ఐడీల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ( V V Srinivasa Rao) సూచించారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఏఆర్ సీపీఎల్ అంబర్‌పేట్, 8వ బెటాలియన్ కొండాపూర్‌లలో ఈ ఎత్తు కొలతలను తీయనున్నట్లు వెల్లడించారు. భౌతిక కొలతలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను తీసుకురావాల్సి ఉంటుందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయకుండా వినతిపత్రాలు రాసి తెచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.