Prashant Kishor Meets CM KCR: సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ, ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో కీలక చర్చలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మోడల్ పేరిట ప్రజల్లోకి వెళ్లనున్నటీఆర్ఎస్
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా, కేసీఆర్‌తో భేటీ (Prashant Kishor Meets CM KCR) కావడం రాజకీయ వర్గాల్లో చర్చను రేపుతోంది.
Hyd, Feb 28: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా, కేసీఆర్‌తో భేటీ (Prashant Kishor Meets CM KCR) కావడం రాజకీయ వర్గాల్లో చర్చను రేపుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల కోసం పనిచేసి ఎన్నికల్లో వారి గెలుపు కోసం కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్నట్లు (Working For TRS In 2023 Polls) తెలుస్తోంది.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు (Telangana assembly elections 2023), జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్ర తదితరాలకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నడుమ శని, ఆదివారాల్లో కీలక భేటీలు జరిగాయి. ముఖ్యమంత్రి సూచన మేరకు శనివారం సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి మల్లన్నసాగర్ ప్రాజెక్టు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సందర్శించిన పీకే, ఆ తర్వాత కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తిరిగి ఆదివారం ఉదయం కూడా ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రితో పీకే భేటీ కొనసాగినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. వీరి భేటీని టీఆర్ఎస్ వర్గాలు గోప్యంగా ఉంచాయి. కాగా, దేశ వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్న పీకే బృందం తెలంగాణలోనూ సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయనతో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం తెలంగాణలో గుజరాత్‌ను మించి, దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ ఆశించిన రీతిలో వాటిని ప్రచారం చేసుకోలేకపోతుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘తెలంగాణ మోడల్’పేరిట ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో దేశంలో ‘తెలంగాణ మోడల్’ప్రచారానికి నిర్ణయం తీసుకున్నారు.
టీఆర్‌ఎస్ పార్టీతో జట్టు కట్టిన ప్రశాంత్ కిషోర్ బృందం కొద్దిరోజులుగా రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు, సంస్థాగతంగా టీఆర్‌ఎస్ (TTS) పరిస్థితిని మదింపు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావాన్ని కూడా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు చేసిన సర్వేల వివరాలు, చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై తన అభిప్రాయాలను సీఎంతో పీకే పంచుకున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌కు ప్రాచుర్యం కల్పించడానికి (ప్రొజెక్ట్ చేయడం) మరికొన్ని సూచనలు కూడా పీకే చేశారు. కాగా రాబోయే రోజుల్లోనూ వ్యూహరచనకు అవసరమైన సమాచారం కోసం ప్రశాంత్ కిషోర్ క్షేత్ర స్థాయిలో అడపాదడపా పర్యటించే అవకాశముందని సమాచారం.
(The above story first appeared on LatestLY on Feb 28, 2022 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

