Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Hyd, Feb 28: నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, టీఆర్ ఎస్ నాయకుడు షాజిద్ ఖాన్ (TRS leader Sajid Khan) 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. స్థానిక విశ్వనాథ్‌పేటకు చెందిన టీఆర్ఎస్ నేత, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడికొచ్చిన ఓ బాలికపై కన్ను వేశాడు. ఆ బాలికను లొంగదీసుకోవాలని నిర్ణయించుకున్న సాజిద్.. అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు. దీంతో ప్లాన్ వేసిన ఆమె.. తాను నిజామాబాద్ వెళ్తున్నానని, తోడుగా రావాలని కోరి వెంటబెట్టుకు వెళ్లింది.

హైదరాబాద్‌లో మంచి దావత్ ఉందని, అది చాలా గ్రాండ్‌గా ఉంటుంది రావాలని బలవంతం చేసింది. కారులో వెళ్లి సాయంత్రానికి వచ్చేద్దామని చెప్పింది. తెలిసిన మహిళే కావడంతో నమ్మి సరేనని వెళ్లింది. బాలిక అంగీకరించడంతో అన్నపూర్ణమ్మ ఎవరికో ఫోన్ చేసింది. ఆ వెంటనే కారు రాగా, అందులో హైదరాబాద్ బయలుదేరారు. బాలికతో కలిసి హైదరాబాద్ చేరుకున్న అన్నపూర్ణమ్మ అప్పటికే చార్మినార్ సమీపంలోని ఓ హోటల్‌లో బస చేసిన సాజిద్‌కు బాలికను అప్పగించింది.

మాయమాటలతో మహిళను లోబర్చుకున్న కానిస్టేబుల్, తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరింపులు, పెళ్లి చేసుకోమంటే తీవ్రంగా కొట్టిన వైనం

అక్కడతడు బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి (Sajid Khan Khan Booked for raping minor) తెగబడ్డాడు. అంతే కాకుండా పలు ప్రదేశాలకు ( Telangana's Nirmal) తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. పోలీసుల వద్దకు వెళ్లొద్దని కూడా ఆమెను బెదిరించాడు. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సాజిద్‌పై ( Nirmal Municipal Vice-Chairperson) పోక్సో సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను తీసుకెళ్లిన అన్నపూర్ణమ్మ, కారు డ్రైవర్‌లను నిందితులుగా పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

రెచ్చిపోయిన కామాంధుడు, 67 ఏండ్ల వృద్ధురాలి ఎదుట హస్తప్రయోగం, చూడమంటూ అసభ్యంగా సైగలు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

నిందితుల ఫోన్లు స్విచ్ఛాప్ అయినట్టు గుర్తించారు. వారి ఫోన్ సిగ్నల్స్ చివరిసారి నిర్మల్, ఆ పరిసరాల్లోనే చూపించినట్టు తెలుస్తోంది. మరోవైపు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలిని సఖి కేంద్రానికి తరలించారు.

నిర్మల్ ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అతని స్థాయితో సంబంధం లేకుండా త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని, భైంసా, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో గాలిస్తున్నామని చెప్పారు.