Nanjanagudu, Feb 26: కర్ణాటకలో ఒక కానిస్టేబుల్ భర్తతో విభేదాలు ఉన్న మహిళ ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్‌కు వస్తే ఆ మహిళతో వివాహేతర సంబంధం (cheating woman in Nanjanagudu) పెట్టుకున్నాడు. రాఫ్ట్రంలో నంజనగూడు తాలుకా హుల్లహళ్ళి పోలీసు స్టేషన్ లో సి.కృష్ణ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అతను టి.నరసిపుర తాలూకా బన్నూరు పోలీసు స్టేషన్ లో పని చేసే సమయంలో.. గౌరమ్మ అనే మహిళ భర్త నంజయ్యతో విభేదాలు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటానికి స్టేషన్ కు వచ్చింది.
ఆమె వద్ద ఫిర్యాదు తీసుకున్న అనంతరం కృష్ణ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కృష్ణ మాటలు నమ్మిన గౌరమ్మ భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెను మాయమాటలతో లోబరుచుకుని మైసూరులో కాపురం పెట్టాడు. ఆమె పేరుమీద సోసైటీలో రూ. 5లక్షల లోన్ తీసుకున్నాడు. విడిగా మరో రూ.5 లక్షలు లోన్ తీసుకున్నాడు. కొంతకాలం తరువాత తనని పెళ్లి చేసుకోవాలని ఆమె కృష్ణని కోరగా పెళ్లి చేసుకోనని, తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించాడు.
ఇటీవల కృష్ణ, అతని కుమారుడు కిరణ్ కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి పోలంలో పడేశారు. ఆమెను గమనించిన స్ధానికులు మైసూరులోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె హుల్లహుళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణను అరెస్ట్ (Head constable arrested) చేసి దర్యాప్తు చేస్తున్నారు