Telangana Shocker: దారుణం, పదవ తరగతి బాలికపై స్నేహితులు అత్యాచారం, ప్రియుడుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపి బ్లాక్ మెయిల్

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పదవ తరగతి బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసిన అతని స్నేహితులు.. వాటిని చూపి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

Credits: Google

Hyd, June 27: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పదవ తరగతి బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసిన అతని స్నేహితులు.. వాటిని చూపి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీసుల తెలిపిన కథనం మేరకు.. కరీంనగర్‌ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఉండే ఇంటర్‌ చదివే బాలుడు, ఆమె ప్రేమించుకునేవారు. సుమారు ఏడాది కిందట ఓ సందర్భంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియో, ఫొటోలను బాలుడి ఇద్దరు స్నేహితులు రహస్యంగా చిత్రీకరించారు.

వాటిని చూపుతూ..తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల వారి స్నేహితులైన మరో ముగ్గురు బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. మూడు రోజుల కిందట విషయం షీటీమ్‌ దృష్టికి వెళ్లడంతో వారు.. అఘాయిత్యానికి పాల్పడిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. విషయాన్ని రహస్యంగా ఉంచారు.

ఇదేం పాడు బుద్ధి, అమ్మాయిలు బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా వీడియోలు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు

సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు ఇంటర్‌ చదువుతున్నారని, మరో వ్యక్తి మేజర్‌ అని, అతను పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement