Telangana Shocker: పిల్లలు నాకు పుట్టలేదని అనుమానం, వారిని గొంతు కోసి దారుణంగా చంపేసిన తండ్రి, తనను కూడా చంపేస్తాడనే కోపంతో అతన్ని చంపేసిన భార్య
భార్యపై అనుమానంతో ఓ కర్కశ తండ్రి కన్నబిడ్డలను కిరాతకంగా హత్య (Husband who killed children) చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు.
Kolhapur, Sep 19: తెలంగాణలో నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం (Telangana Shocker) చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ కర్కశ తండ్రి కన్నబిడ్డలను కిరాతకంగా హత్య (Husband who killed children) చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. కానీ ఎట్టకేలకు చావుబతుకుల నుంచి బయటపడ్డాడు.అయితే తన కుమార్తెలను చంపిన భర్త తనని కూడా ఎక్కడ చంపుతాడేమోనన్న భయంతో భార్య అతడిని హత్య (Wife killed him ) చేసింది. కొల్లాపూర్ మండలంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన వివరాల్లోకి వెళితే.. కుడికల్ల గ్రామానికి చెందిన ఓంకార్, అదే గ్రామానికి చెందిన మహేశ్వరి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి చందన (3), విశ్వనాథ్ (1) పిల్లలు ఉన్నారు. నెల రోజుల కిందట భార్య, పిల్లలపై అనుమానంతో మూడో సంతానం కావాలని భార్యను కోరాడు.ఇందుకు నిరాకరించడంతో.. కోపంతో ఎత్తం గ్రామ సమీపంలోని గట్టు ప్రాంతంలో ఇద్దరి పిల్లలను కర్కశంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఓంకార్ సైతం గొంతు కోసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలోనే పాలమూరు ఆసుపత్రిలో కోలుకున్న తర్వాత ఓంకార్ శుక్రవారం సాయంత్రం కుడికిల్లలోని ఇంటికి వచ్చాడు.ఇంటికి వచ్చాక సైతం మళ్లీ వేధింపులకు దిగడం, పిల్లలను తనకు దూరం చేశాడన్న కోపంతో మహేశ్వరి ఆదివారం ఉదయం ఓంకార్ నిద్రిస్తున్న సమంలో గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ రామేశ్వర్, సీఐ యాలాద్రి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.