Maharashtra Shocker: అనుమానంతో భార్యను కిరాతకంగా చంపిన భర్త, తలను వేరు చేసి మిగతా భాగాన్ని చెరువలో పడేశాడు, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం (Maharashtra Shocker) చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి, శరీరం నుంచి తలను వేరు చేశాడు.ఆ తర్వాత తల లేని భార్య శరీరాన్ని దగ్గరలోని చెరువులో పడేశాడు.

Maharashtra Shocker: అనుమానంతో భార్యను కిరాతకంగా చంపిన భర్త, తలను వేరు చేసి మిగతా భాగాన్ని చెరువలో పడేశాడు, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు
Representational Image | (Photo Credits: IANS)

Mumbai, Sep 16: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం (Maharashtra Shocker) చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి, శరీరం నుంచి తలను వేరు చేశాడు.ఆ తర్వాత తల లేని భార్య శరీరాన్ని దగ్గరలోని చెరువులో పడేశాడు. పోలీసులకు కాలాంబ్ చెరువులో గతేడాది జులై నెలలో ఒక తల లేని మొండెం (Headless body case cracked) కనిపించింది.దీనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

ఇందులో భాగంగా స్థానికంగా మిస్సింగ్ కేసులు ఉన్నాయేమో అని పరిశీలించారు. అయితే ఏడాది గడుస్తున్నా ఎవరూ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి రాలేదు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది ఆగస్టు 29న కర్ణాటకలోని బెళగావికి చెందిన ఒక మహిళ పోలీసులను సంప్రదించింది. తన మనుమరాలు సానియా ఆసిఫ్ షేక్ (24) ఏడాదిగా కనిపించడం లేదని చెప్పింది. ఆమె కనిపించకుండా పోతే కేసు పెట్టాల్సిన సానియా భర్త ఆసిఫ్ హనీఫ్ షేక్ (32)ను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు.

స్నేహితుడే అసలు సూత్రధారి, యూపీలో అక్కాచెళ్లెల్లపై అత్యాచారం, హత్య కేసులో ఆరుమంది అరెస్ట్, చెరుకుతోటకు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారని తేల్చిన పోలీసులు

అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన అతను థానే జిల్లాలో పోలీసులకు చిక్కాడు. విచారణలో తనే భార్యను చంపినట్లు (man held for murder Wife) ఆసిఫ్ అంగీకరించాడు. సౌదీ నుంచి తిరిగొచ్చిన అతనికి భార్యపై అనుమానం వచ్చిందని, దీంతోనే మరొక వ్యక్తితో కలిసి అత్యంత కిరాతకంగా చంపేశాడని పోలీసులు తెలిపారు. సానియా తల ఇంకా దొరకలేదని, ప్రస్తుతం హత్యలో ఆసిఫ్‌కు సహకరించిన మరో నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Sep 16, 2022 09:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).