Telangana Shocker: తెలంగాణలో ఆగని విద్యార్థినుల ఆత్మహత్యలు, మన్ననూరు గురుకులంలో ఉరివేసుకుని విద్యార్థిని సూసైడ్, క్లాస్ టీచర్ వేధింపులతోనే ఆత్మహత్య అంటున్న తల్లిదండ్రులు

నాగర్‌ కర్నూలు జిల్లాలోని మన్ననూరు గురుకులంలో (mannanur gurukulam school) దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు ( Student hangs self) పాల్పడింది. క్లాస్‌రూమ్‌లో నిఖిత అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది

Pooja Sarkar Suicide Representative Image (Photo Credits: Unsplash)

Hyd, Mar 7: నాగర్‌ కర్నూలు జిల్లాలోని మన్ననూరు గురుకులంలో (mannanur gurukulam school) దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు ( Student hangs self) పాల్పడింది. క్లాస్‌రూమ్‌లో నిఖిత అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో నిఖిత ఘర్షణ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థిని మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది.ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయులకు తెలియడంతో ఇద్దరు విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారని వార్తలు వస్తున్నాయి.

మానసిక వేదనే నిఖిత సూసైడ్‌కు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొట్టి చంపారని నిఖిత తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో మన్ననూరు గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్లాస్ టీచర్ వేధింపులే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

భార్యను చంపి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన భర్త, వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానమే కారణం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ లో జరుగుతున్న విషయాలపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు తోటి విద్యార్ధుల తల్లిదండ్రులు.గ్రౌండ్ టైంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. దీంతో స్టూడెంట్ నిఖిత సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు ప్రిన్సిపాల్.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement