Telangana Shocker: కంట్లో కారం కొట్టి..మహిళ బట్టలూడదీసి నగ్నంగా రోడ్డు మీద ఊరేగించిన ప్రత్యర్థులు, తెలంగాణ సూర్యాపేటలో దారుణ ఘటన, 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుష ఘటన (Telangana Shocker) చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసి కొంతమంది దాడి (woman was stripped naked and assaulted) చేశారు

Representational Image | (Photo Credits: IANS)

Suryapet, August 30: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుష ఘటన (Telangana Shocker) చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసి కొంతమంది దాడి (woman was stripped naked and assaulted) చేశారు. ఆ మహిళ కంట్లో కారం చల్లి నడిరోడ్డుపై కర్రలతో దాడి చేస్తూ నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. ఇది గమనించిన ఎంపీటీసీ సభ్యురాలు బాధితురాలికి వస్త్రాలు ఇచ్చి రక్షించారు. ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన‌ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్‌ 11వ తేదీన జరిగిన ఓ హత్య కేసులో బాధితురాలు నిందితురాలిగా ఉంది. జైలులో శిక్ష పొందుతూ బెయిల్ పై మహిళ విడుదలై తండాకు రావడంతో ప్రతీకారంతో మృతుడి బంధువులు గ్రామంలో అందరూ చూస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఇంత రాక్షసత్వమా, ట్రక్కుకు మనిషిని కట్టేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన క్రూరులు, మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో దారుణ ఘటన, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హత్యకు గురయిన వారి కుటుంబసభ్యులే మహిళపై ఈ అమానుష ఘటనకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement