Telangana Shocker: నన్ను ప్రేమించు లేదా ఏదైనా తాగి చావు, నిశ్చితార్థం జరిగిన యువతికి వేధింపులు, తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

Representational Image (Photo Credits: File Image)

Hyd, Mar 20: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండపేల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మ అనే యువతిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్‌ కుమార్‌ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, పెల్లి చేసుకోవాలని యువతిని తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వేధించవద్దని యువతి కోరినా యువకుడు పట్టించుకోలేదు.

చైల్డ్ పోర్నోగ్రఫీపై హైదరాబాద్ పోలీసులు కొరడా, 44 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, చూసినా, ప్రమోట్ చేసినా 5 ఏళ్లు జైలు శిక్ష

అంతేగాక తనను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఈనెల 18న యువతికి ఫోన్‌చేసి నువ్వు చచ్చిపో, బతికి ఉండకు అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకువచ్చారు.

రైల్వే స్టేషన్‌లో సమాచారం బదులు పోర్న్ వీడియోలు డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలలో సెక్స్ వీడియోలు రావడంతో షాక్‌కు గురైన ప్రయాణికులు

అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం యువతి మృతి చెందింది. దీంతో వినయ్ కుమార్ వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement