Kanti Velugu: తెలంగాణలో మళ్లీ 'కంటి వెలుగు'.. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం.. జనవరి 18 నుంచి రెండో విడత అమలు
తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కంటి వెలుగు కార్యక్రమం అమలు కాబోతోంది. జనవరి 18 నుంచి రెండో విడత అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం తొలి విడతకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. 2018 ఆగస్ట్ 15న మెదక్ జిల్లా మల్కాపూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Hyderabad, Nov 18: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు (Kanti Velugu) కార్యక్రమం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతోంది. జనవరి 18 నుంచి రెండో విడతగా (Second Phase) ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం తొలి విడతకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. 2018 ఆగస్ట్ 15న మెదక్ జిల్లా మల్కాపూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం అప్పట్లో ప్రభుత్వం రూ. 106 కోట్లను ఖర్చు చేసింది. కళ్లద్దాలతో పాటు మందులను కూడా పంపిణీ చేసింది.
ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యశాఖ మంత్రితో పాటు కొందరు ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు.