Telangana: తీవ్ర విషాదం, తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మృతి, బిడ్డ మృతి చెందిందన్న వార్త విని కుప్పకూలిన తల్లిదండ్రులు

తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మరణించిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నా­రి రియాన్షిక సోమవా­రం రాత్రి హోం వర్క్‌ చేస్తున్న టైంలో బెడ్‌ మీద నుంచి కింద పడిపోయింది

UKG Student Dies After Pen Pierces Her Head in Bhadrachalam Town

Hyd, July 3: తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మరణించిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నా­రి రియాన్షిక సోమవా­రం రాత్రి హోం వర్క్‌ చేస్తున్న టైంలో బెడ్‌ మీద నుంచి కింద పడిపోయింది. అయితే ప్రమాదవశాత్తు పెన్ను ఆమె తలలో గుచ్చుకుంది. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతికష్టం మీద వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ను తొలగించారు. నిద్రలో నడిచే అలవాటుతో ఆరో అంతస్తు నుండి పడిన యువకుడు, తలకు బలమైన గాయంతో అక్కడికక్కడే మృతి

పెన్ను తొలగించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్టేనని వైద్యు­లు భావించారు. ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వైద్యులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. అయితే పరిస్థితి విషమించి రియాన్షిక కన్నుమూసింది. సర్జరీ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ సోకడంతోనే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. బతికిందని సంతోషించే లోపే బిడ్డ మృతి చెందిందన్న వార్త విని ఆ తల్లిదం‍డ్రులు కుప్పకూలిపోయారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement