Telangana Weather Alert: తెలంగాణను వణికిస్తున్న తీవ్ర వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు.. భారీ వర్షాల హెచ్చరిక..

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ దిశగా వేగంగా దూసుకొస్తుండటంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావంతో గడిచిన 20 గంటలుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Hyderabad Rains video (Photo-Video Grab)

Telangana Weather Alert: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ దిశగా వేగంగా దూసుకొస్తుండటంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావంతో గడిచిన 20 గంటలుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 36 గంటల్లో రాష్ట్రంలో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా జూలై 29 అర్ధరాత్రి నుంచి 30వ తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు అత్యంత తీవ్రంగా మారవచ్చని తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 30 సెం.మీ నుంచి 45 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా. ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.

మళ్లీ ముంచుకొస్తున్న భారీ వర్షం.. హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వాన.. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ .. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక..

రాజధాని హైదరాబాద్‌లో రోజంతా ముసురు వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నల్లగొండ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో స్వల్ప వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రాకూడదని, లోతట్టు ప్రాంతాల వాసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

జయశంకర్‌ భూపాలపల్లి (పలిమెల) – 19.43 సెం.మీ(అత్యధికం)

జగిత్యాల (సారంగపూర్) – 19.40 సెం.మీ, బుగ్గారం – 18.33 సెం.మీ, వెలగటూర్ – 17.57 సెం.మీ

పెద్దపల్లి (కమాన్‌పూర్) – 14.14 సెం.మీ

ములుగు (వాజేడు) – 13.36 సెం.మీ

నిర్మల్ – 13.23 సెం.మీ

తీవ్ర వాయుగుండం ప్రభావం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై కూడా కనిపిస్తోంది. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 7.2 సెం.మీ, కృష్ణా జిల్లా కంకిపాడులో 6.7 సెం.మీ, పెనమలూరులో 6.46 సెం.మీ వర్షపాతం నమోదైంది. గురువారం పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement