Ujjaini Mahankali Bonalu 2026: విగ్రహ ప్రతిష్ట చేయకుంటే.. నా పాదాల కింద నలిపేస్తా.. రంగం భవిష్యవాణిలో స్వర్ణలత.. చివరి ఘట్టానికి చేరుకున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో అత్యంత ప్రాధాన్యం కలిగిన 'రంగం' కార్యక్రమాన్ని మాతంగి స్వర్ణలత నిర్వహించారు. రంగం సందర్భంగా అమ్మవారి ఆవాహనతో భవిష్యవాణి వినిపించడం బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఆధ్యాత్మిక ఘట్టంగా భావిస్తారు.

Matangi Swarnalatha (Photo-Video Grab)

Ujjaini Mahankali Bonalu 2026: సికింద్రాబాద్‌ లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయి. జాతరలో అత్యంత కీలకమైన, విశేషమైన 'రంగం భవిష్యవాణి' కార్యక్రమం సోమవారం ఉదయం భక్తుల జనసందోహం నడుమ నేత్రపర్వంగా జరిగింది. స్వర్ణలత మాతంగి రంగమెక్కి అమ్మవారి స్వరూపంగా భవిష్యవాణిని వినిపించారు.ఈ సందర్భంగా ప్రజల ప్రవర్తనపై, నిర్లక్ష్యంపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని స్వర్ణలత పేర్కొన్నారు.

రంగంలో మాతంగి స్వర్ణలత వినిపించిన ప్రధాన హెచ్చరికలు:

సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చా: "నా మాటలను ఎవరూ ఆచరించడం లేదు. ఘటాలు, బోనాలు సమర్పించినప్పటికీ నేను సంతోషంగా రాలేదు, తీవ్ర క్రోధంతో వచ్చాను. మీ ప్రశ్నలకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి?" అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఆగస్టు 3 సోమవారం రాశి ఫలాలు.. గ్రహాల ప్రభావం మీ జీవితంపై ఎలా ఉంటుంది?

విగ్రహ ప్రతిష్ఠ ఆలస్యంపై ఆగ్రహం: "రెండేళ్లు పూర్తయినా నా విగ్రహ ప్రతిష్ఠ చేయడం లేదు. ఆరు నెలల వ్యవధిలో విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే వాడవాడలా ప్రాణనష్టమే సంభవిస్తుంది. నా మాట వినని వారిని, వావివరుసలు లేకుండా ప్రవర్తించే వారిని నా పాదాల కింద నలిపేస్తా" అని హెచ్చరించారు.

కుంభవర్షాలు – అగ్నిప్రమాదాల హెచ్చరిక: ఈ ఏడాది గతంలో చెప్పినట్లే కుంభవర్షాలు కురుస్తాయని, భారీ వర్షాల వల్ల తీవ్ర ప్రాణనష్టం, సగానికి సగం కొట్టుకుపోయే పరిస్థితులు ముంచుకొస్తాయని హెచ్చరించారు. దీనికి తోడు అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశముందని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

యువత క్రమశిక్షణ తప్పడంపై ఆందోళన: తల్లిదండ్రులు పిల్లలను విచ్చలవిడిగా ఊరిమీద వదిలేస్తున్నారని, యువత సరైన మార్గంలో నడిచేలా చూడటంతో పాటు జనాలు తమ ప్రవర్తనను మార్చుకోవాలని స్పష్టం చేశారు.

అంబారీ ఊరేగింపుతో ముగియనున్న ఉత్సవాలు: స్వర్ణలత హెచ్చరికల నేపథ్యంలో ఆలయ అర్చకులు స్పందిస్తూ.. ఏడాది వ్యవధిలో తప్పకుండా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేస్తామని మాటిచ్చారు.

రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారిని గజవాహనం (అంబారీ)పై అంగరంగ వైభవంగా ఊరేగించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, సాయంత్రం జరగనున్న అంబారీ ఊరేగింపుతో సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు వైభవంగా ముగియనున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement