Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. గజ్జున వణుకుతున్న ప్రజలు.. వచ్చే మూడు రోజులు మరింతగా పెరుగనున్న చలి

శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.

Cold Wave in Telangana (Photo-ANI)

Hyderabad, Jan 7: శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన (Telugu States) ఏపీ (AP), తెలంగాణలో (Telangana) చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది. అయితే, దానికి భిన్నంగా చలి-పులి విరుచుకుపడుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పది రోజుల క్రితం వరకు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్‌ లో ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్‌ కే పరిమితం అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 9 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరం నుంచి వీస్తున్న చలి గాలులతో ఈ పరిస్థితి నెలకొని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో రానున్న మూడ్రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతాయన్నారు. ఆ తర్వాత రెండు రోజులు 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ

పొగమంచు కూడా..

తెలంగాణతో పాటు అటు ఏపీలో 5 రోజులపాటు ఉదయం వేళల్లో పొగ మంచు ఏర్పడుతుందని అధికారులు చెప్పారు. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, రెండేళ్లలోపు పిల్లలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. శ్వాసకోస సంబంధిత సమస్యల వస్తాయని.. వైరల్‌ ఇన్‌ ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని అంటున్నారు.

తెలంగాణలో సవరించిన ఓటరు జాబితా ఇదిగో, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు,శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement