Anonymous Video Calls: కాల్ ఎత్తగానే నగ్నంగా.. మనల్ని కూడా నగ్నంగా చూడాలంటూ ఊరిస్తారు, ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది, సెక్స్‌టార్షన్‌ పై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు, సైబర్ నిపుణులు

దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. కొంతకాలంగా తగ్గిపోయిన ‘సెక్స్‌టార్షన్‌’ (SexTortion‌) కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఉత్తర రాష్ట్రాలు కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై సైబర్‌ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Image used for representational purpose. (Photo Credits: Pxhere)

దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. కొంతకాలంగా తగ్గిపోయిన ‘సెక్స్‌టార్షన్‌’ (SexTortion‌) కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఉత్తర రాష్ట్రాలు కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై సైబర్‌ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలియని అకౌంట్ల నుంచి కాల్ (Anonymous video calls) మనం ఎత్తగానే అవతల నగ్నంగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు. అయితే ఆ తరువాత వారు మనల్ని మాటల్లో దించి నగ్నంగా (Nude Video Calls) కనిపించమని చెబుతారు. మనం ఆశపడి నగ్నంగా కనిపిస్తే ఇక అంతే సంగతులు.

కాసేపటికి అనోమస్ నెంబర్‌ లేదంటే సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ లేదంటే మెసేజ్‌లు వస్తాయి. అశ్లీల వీడియోలు చూసిన మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేశామనో, ఫొటోలు తీశామనో బెదిరిస్తారు. కొంత డబ్బును డిమాండ్‌ చేస్తూ.. ట్రాన్స్‌ఫర్‌ చేయకపోతే ఆ వీడియో/ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరిస్తారు. ఈ నేపథ్యంలో కొందరు భయపడి వారు అడిగినంత ముట్ట చెబుతారు. సదరు అకౌంట్‌లను బ్లాక్‌ చేయడమో లేదంటే యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ చేయడమో చేస్తుంటారు. అయినా సమస్యకు పరిష్కారం చిక్కకపోవచ్చు. దీనిపై నిపుణులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ప్రముఖ కంపెనీల ఆండ్రాయిడ్ ఫోన్లపై హ్యాకర్ల దాడి, మీరు మాట్లాడుకున్నదంతా వారి చేతుల్లోకి, కంపెనీలు ఏం జాగ్రత్తలు చెబుతున్నాయంటే..

కేవలం మేవాత్‌ (హర్యానా), భరత్‌పూర్‌ (రాజస్థాన్‌) నుంచి 36 బ్యాచ్‌లు దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయని పోలీసులు తేల్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి 600 మందికి పైగా అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. సెక్స్‌టార్షన్‌లు చాలా సీరియస్‌ నేరాలుగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లోగానీ, వాట్సాప్‌లోగానీ, ఇతర ఏ యాప్‌లలో అయినాగానీ తెలియని అకౌంట్లు, గుర్తుతెలిని నెంబర్ల నుంచి వీడియో కాల్స్‌ వచ్చినప్పుడు లిఫ్ట్‌ చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు.

ఒకవేళ కంగారులో లిఫ్ట్‌ చేసినా కెమెరాను కవర్‌ చేయాలి. కాల్స్‌ వచ్చే నెంబర్లు, అకౌంట్లను బ్లాక్‌ చేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయాలి. బ్లాక్‌మెయిలింగ్‌ కాల్స్‌, మెసేజ్‌లకు ఎక్కువసేపు స్పందించకుండా ఉంటే.. ఫిర్యాదు చేస్తారేమోనని నేరగాళ్లే భయపడొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా ఫిర్యాదులు చేయడమే ఉత్తమమని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement