Netflix Layoffs 2026: ఆగని లేఆప్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగాల కోత.. దాదాపు 800 మంది సిబ్బందిపై వేటుకు సిద్ధమవుతున్న ఓటీటీ దిగ్గజం
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తమ ఉద్యోగులకు సంకేతాలు ఇస్తూ భారీ పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో సుమారు 5 శాతం మందిని, అంటే దాదాపు 800 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Netflix Layoffs 2026: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తమ ఉద్యోగులకు సంకేతాలు ఇస్తూ భారీ పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో సుమారు 5 శాతం మందిని, అంటే దాదాపు 800 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ తొలగింపులకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలోనే వెలువడే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలుపుతున్నాయి.
2025 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో సుమారు 16,000 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు విధుల్లో ఉండగా, అందులో ఏకంగా 68 శాతం మంది అమెరికా , కెనడా ప్రాంతాల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం భావిస్తున్న ఈ ఉద్యోగాల కోత గనుక అమలైతే, చందాదారుల సంఖ్య తగ్గి వృద్ధి మందగించిన 2022 సంవత్సరం తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో జరిగే అతిపెద్ద లేఆఫ్ ఇదే కానుంది. అయితే ఈ ప్రచారం , నివేదికలపై స్పందించేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు నిరాకరించారు. . అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు షాక్.. అమెరికా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేత..
ఈ కోతల ప్రభావం ప్రధానంగా ఏ విభాగాలపై పడుతుందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ, ఫీచర్ ఫిల్మ్‌లపై పనిచేసే క్రియేటివ్ బృందాలపై అధిక్ ప్రభావం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓటీటీ మార్కెట్‌లో తీవ్రమవుతున్న పోటీ, ప్రసార మాధ్యమాల విలీనాలు , యూట్యూబ్ వంటి ఉచిత ప్లాట్‌ఫారమ్‌లు వీక్షకులను, ప్రకటనల ఆదాయాన్ని విశేషంగా ఆకర్షిస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సబ్‌స్క్రిప్షన్‌లపైనే కాకుండా ప్రకటనలతో కూడిన ప్లాన్లు, లైవ్ స్ట్రీమింగ్, , గేమింగ్ వంటి కొత్త రంగాలపై కంపెనీ దృష్టి సారిస్తోంది. తాము వృద్ధి బాటలోనే ఉన్నప్పటికీ, ఆశించినంత వేగంగా పురోగతి సాధించలేకపోతున్నామని కంపెనీ కో-సీఈఓ టెడ్ సారండోస్ ఇటీవల అంగీకరించడం గమనార్హం.
ఆర్థిక అంశాల విషయానికి వస్తే, జూలైలో వెల్లడించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ 12.56 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసి 13 శాతం వృద్ధిని కనబరిచింది. అయినప్పటికీ, 2026 పూర్తి సంవత్సరానికి సంబంధించిన రాబడి అంచనాలను తగ్గించడం , గడిచిన సంవత్సర కాలంలో కంపెనీ షేరు ధర గణనీయంగా క్షీణించడం పెట్టుబడిదారులను కలవరపెడుతోంది. అక్టోబర్ 20న తదుపరి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న తరుణంలో నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటున్న ఈ పునర్‌వ్యవస్థీకరణ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది.