OpenAI GPT-6 Astra: జీపీటీ-6 అస్త్ర వచ్చేసింది.. కంప్యూటర్‌ను మనిషిలా ఆపరేట్ చేసే కొత్త AI మోడల్.. అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఇక ఊడినట్లే..
కృత్రిమ మేధ (AI) రంగాన్ని శాసిస్తున్న ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తాజాగా 'జీపీటీ-6 అస్త్ర' (GPT-6 Astra) అనే అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడల్‌ను విడుదల చేసింది.
OpenAI GPT-6 Astra: కృత్రిమ మేధ (AI) రంగాన్ని శాసిస్తున్న ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తాజాగా 'జీపీటీ-6 అస్త్ర' (GPT-6 Astra) అనే అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడల్‌ను విడుదల చేసింది. కొన్ని వారాలుగా ఈ మోడల్‌పై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొనగా.. కంప్యూటర్ వినియోగం, సైన్స్, కోడింగ్, ప్రొఫెషనల్ పనులు, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఇప్పటివరకు తాము తయారు చేసిన మోడళ్లన్నింటిలోనూ ఇది అత్యుత్తమమైనదని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ప్రకటించారు.
'అస్త్ర' ఆవిష్కరణతో శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు కొత్త ఊపిరి వస్తుందని సామ్ ఆల్ట్‌మన్ పేర్కొనగా.. ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ స్పందిస్తూ.. ప్రస్తుతం మానవాళి 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్' (AGI) యుగంలోకి ప్రవేశించిందని భావించడం ఎంతమాత్రం అసంబద్ధం కాదని అన్నారు. భవిష్యత్తు ఏఐ చరిత్రలో ఈ మోడల్ విడుదల ఒక కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఫ్రీ ATM ట్రాన్సాక్షన్ల పరిమితి సగానికి కోత..
కోడింగ్, మ్యాథ్స్ పరీక్షల్లో 'అస్త్ర' సంచలనాత్మక స్కోర్లు నమోదు చేసింది. ఓపెన్ ఏఐ అంతర్గత పరీక్షల ప్రకారం ఇది పోటీ మోడళ్లైన జీపీటీ-5.6 Sol, క్లాడ్ ఫేబుల్ 5.1 లను దాటి ముందుకెళ్లింది:
ఫ్రాంటియర్ మ్యాథ్ టైర్ 4: 98 శాతం స్కోరు
ఏఆర్‌సీ-ఏజీఐ 3 (ARC-AGI 3): 99.9 శాతం స్కోరు
టెర్మినల్-బెంచ్ 4.0: 57.9 శాతం స్కోరు (పోటీ మోడళ్లైన జీపీటీ-5.6 Sol 37.3%, క్లాడ్ ఫేబుల్ 55.8% సాధించాయి)
కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ఫారాలు నింపడం, క్యాలెండర్ షెడ్యూలింగ్, శాస్త్రీయ డేటా విశ్లేషణ, వెబ్‌సైట్ల నిర్మాణం, సాఫ్ట్‌వేర్ ఇన్స్టాలేషన్, బ్లెండర్‌లో 3డీ మోడలింగ్, ప్రెజెంటేషన్లు తయారు చేయడం, చట్టపరమైన పత్రాలు/టాక్స్ రిటర్న్‌ల తయారీ వంటి సంక్లిష్టమైన పనులను 'అస్త్ర' స్వయంగా నిర్వహించగలదు. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ పరిమితులు లేని ఎక్స్‌ప్లాయిట్‌బెంచ్‌పై 100% స్కోర్ సాధించడంతో.. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సంస్థ దీనిపై కఠిన నియంత్రణలు విధించింది.
ప్రస్తుతం 'డేబ్రేక్ సైబర్ సెక్యూరిటీ' ప్రోగ్రామ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న 'అస్త్ర', వచ్చే వారం నుంచి చెల్లింపు చాట్‌జీపీటీ (ChatGPT) ప్లాన్లతో పాటు ఓపెన్ ఏఐ ఏపీఐ (API), ఏడబ్ల్యూఎస్ (AWS), అమెజాన్ బెడ్‌రాక్‌లలో దశలవారీగా అందుబాటులోకి రానుంది. మోడల్ విడుదల ఆలస్యమైనందుకు సామ్ ఆల్ట్‌మన్ వినియోగదారులకు క్షమాపణలు తెలిపారు.