Prevention of Ageing Process: వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్-సీ.. చైనా సైంటిస్టుల వెల్లడి
మానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని, విటమిన్-సీ సప్లిమెంట్స్ తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని చైనా సైంటిస్టులు చెబుతున్నారు.
Hyderabad, Nov 7: మానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని, విటమిన్-సీ సప్లిమెంట్స్ (vitamin C supplements) తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని (Prevention of Ageing Process) చైనా సైంటిస్టులు (Chinese researchers) చెబుతున్నారు. దీనికి సంబంధించి కోతులపై జరిపిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా కథనాలు వెలువరించాయి. ఈ కథనం ప్రకారం, బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన సైంటిస్టుల బృందాలు 7 సంవత్సరాలుగా ‘యాంటీ-ఏజింగ్’పై పరిశోధనలు జరిపాయి.
మనిషి వెన్నుపాములోని ప్రత్కేక లక్షణాలున్న కణాల సముదాయం వృద్ధాప్యానికి కారణమవుతున్న మోటార్ న్యూరాన్లను ఉత్పత్తి చేస్తున్నది. అత్యంత సున్నితమైన ఈ కణాల జీవితకాలాన్ని విటమిన్-సీ పెంచిందని 10 కోతులపై సైంటిస్టులు జరిపిన పరిశోధనలో తేలింది. ట్యాబ్లెట్ల రూపంలో విటమిన్-సీ తీసుకున్నా వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని సైంటిస్టుల పరిశోధన అభిప్రాయపడింది.