Travel to Space for Just Rs 200: విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!

అయితే, వేలల్లో టికెట్లు చెల్లించి ఎక్కడం చాలామందికి ఇబ్బందికరం. అయితే, కేవలం రూ.200 చెల్లించి విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా అంతరిక్షంలోనే షికార్లు కొట్టొచ్చు.

Space Travel (Credits: Pixabay)

Newdelhi, July 2: విమానం (Plane) ఎక్కి గాలిలో చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. అయితే, వేలల్లో టికెట్లు (Tickets) చెల్లించి ఎక్కడం చాలామందికి ఇబ్బందికరం. అయితే, కేవలం రూ.200 చెల్లించి విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా అంతరిక్షంలోనే షికార్లు కొట్టొచ్చు. భారతీయులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘అంతరిక్ష అన్వేషణ, పరిశోధన ఏజెన్సీ’ (సెరా) భారతీయులకు అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. వివిధ దేశాలకు చెందిన ఆరుగురు పౌరులను వ్యోమగాములుగా తీర్చిదిద్ది… అంతరిక్షంలో పంపేందుకు సెరా మానవ సహిత ‘స్పేస్‌ ఫ్లైట్‌ ప్రోగ్రాం’ను చేపట్టింది. ‘బ్లూ ఆరిజన్‌’ కంపెనీ తయారుచేసిన ‘న్యూ షెషర్డ్‌ రాకెట్‌’ ద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపనున్నది. ఇందుకు సంబంధించి వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ మొదలైంది.

కలుద్దామంటూ రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ, జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..

ఎంపిక ఇలా..

భారత పౌరసత్వం ఉన్న పౌరులెవ్వరైనా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ‘సెరా’ తెలిపింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. పబ్లిక్‌ వోటింగ్‌, మూడు దశల్లో ‘ఎలిమినేషన్‌’తో భారత్‌ ప్రతినిధిగా ఒకరిని వ్యోమగామిగా ఎంపిక చేస్తారు.

దారుణం, బంధువుల పెళ్ళికి తండ్రి తీసుకెళ్లలేదని 7వ తరగతి బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య, కాచిగూడలో విషాదకర ఘటన

ఎక్కడివరకూ తీసుకెళ్తారు?

రాకెట్‌ ద్వారా వ్యోమగాముల్ని భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. అక్కడ వారు 11 నిమిషాలపాటు గడిపేందుకు అవకాశముంటుంది.