TRAI New Rules: మొబైల్ యూజర్లకు TRAI గుడ్‌న్యూస్.. డేటా అవసరం లేని వారికి షార్ట్‌టర్మ్ రీచార్జ్ ప్లాన్లు..టెలికాం కంపెనీలకు TRAI ఆదేశాలు

బండిల్డ్ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం రీఛార్జ్ ఎంపికలను విస్తరిస్తూ, కేవలం వాయిస్, SMS సేవల కోసమే తక్కువ కాలపరిమితి గల స్పెషల్ టారిఫ్ వోచర్‌లను (STVలు) అందించాలని టెలికాం రెగ్యులేటరీ అథపరిటీ ఆఫ్ ఇండియా (TRAI) నూతన నిబంధనలను ఖరారు చేసింది.

Smartphone Users Checking Mobile (Credits: X)

TRAI New Rules: బండిల్డ్ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం రీఛార్జ్ ఎంపికలను విస్తరిస్తూ, కేవలం వాయిస్, SMS సేవల కోసమే తక్కువ కాలపరిమితి గల స్పెషల్ టారిఫ్ వోచర్‌లను (STVలు) అందించాలని టెలికాం రెగ్యులేటరీ అథపరిటీ ఆఫ్ ఇండియా (TRAI) నూతన నిబంధనలను ఖరారు చేసింది.

టెలికాం సేవా ప్రదాతలు వాయిస్, SMS, డేటా కాంబో ఆఫర్లకు అనుగుణంగా 30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితి గల 'వాయిస్ & SMS ఓన్లీ' STVలను విధిగా అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ప్రతి నెలా ఒకే తేదీన పునరుద్ధరించుకోగలిగే కనీసం ఒక వాయిస్ & SMS STVని కూడా ఆపరేటర్లు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తేదీ ఆ నెలలో లేకపోతే (ఉదాహరణకు ఫిబ్రవరిలో 30 లేదా 31 తారీఖులు లేనప్పుడు), ఆ నెల చివరి తేదీ పునరుద్ధరణ తేదీగా మారుతుంది. దీనికి అదనంగా, నెలవారీ రీఛార్జ్ ఆప్షన్ కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన కనీసం ఒక వాయిస్ & SMS STVని కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.  మీ పేరుతో SIM ఉందా.. అది వేరొకరికి ఇస్తున్నారా జాగ్రత్త.. రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు తప్పదంటున్న DoT..

టెలికాం కంపెనీలు కేవలం వాయిస్, SMSల కోసం ఇచ్చే వోచర్ల సంఖ్యను తగ్గించేసి, వాటిని ఎక్కువ కాలపరిమితి ప్లాన్లకే పరిమితం చేశాయని రెగ్యులేటర్ గమనించింది. దీనివల్ల తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులు, అలాగే మొబైల్ డేటా అవసరం లేని సాధారణ ఫోన్ వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన ట్రాయ్, ఈ పదమూడవ సవరణ నిబంధనలను ఖరారు చేసింది. వాటాదారుల నుండి 1,132 స్పందనలు స్వీకరించి, విస్తృత చర్చల అనంతరం తుది మార్గదర్శకాలను వెల్లడించింది.

ఈ నూతన నిబంధనల వల్ల ప్రధానంగా కాల్స్ మరియు సందేశాల కోసం మాత్రమే మొబైల్ కనెక్షన్ వాడే సామాన్యులకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. అవసరం లేని డేటా ప్లాన్లతో పనిలేకుండా తమ బడ్జెట్‌కు అనుగుణంగా తక్కువ ధరకు తక్కువ కాలపరిమితి రీఛార్జ్‌లు ఎంచుకునే అవకాశం లభిస్తుంది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement