Plague in Russia? రష్యా యాంటీ ప్లేగు ల్యాబ్‌లో పరిశోధకురాలి అనుమానాస్పద మృతి..దాదాపు 200 మంది క్వారంటైన్.. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆరోగ్యశాఖ సూచన

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో 28 ఏళ్ల యువ పరిశోధకురాలు డారియా షిపిలోవా అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఇర్కుట్స్క్‌లోని ప్రముఖ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న ఆమె సెప్టెంబర్ 29న తీవ్రమైన న్యుమోనియా లక్షణాలతో స్థానిక ఆసుపత్రిలో చేరారు.

Virus Alert(X)

Plague in Russia? రష్యాలోని సైబీరియా ప్రాంతంలో 28 ఏళ్ల యువ పరిశోధకురాలు డారియా షిపిలోవా అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఇర్కుట్స్క్‌లోని ప్రముఖ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న ఆమె సెప్టెంబర్ 29న తీవ్రమైన న్యుమోనియా లక్షణాలతో స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఆమె అక్టోబర్ 2న ప్రాణాలు కోల్పోవడంతో ఈ విషాద పరిణామం వెలుగులోకి వచ్చింది. అయితే డారియా పనిచేసే ల్యాబ్‌లో ప్రయోగాల సమయంలో జీవ నమూనాలకు సంబంధించిన ప్రమాదం జరిగిందని, ప్లేగు సూక్ష్మజీవులు ఉన్న టెస్ట్‌ట్యూబ్ పగిలిపోవడం వల్లే ఆమెకు ఇన్ఫెక్షన్ సోకి మరణించిందనే వార్తలు స్థానికంగా, అంతర్జాతీయ మీడియాలో విపరీతంగా ప్రచారమయ్యాయి.  భారత ఫార్మా కంపెనీలకు గుడ్‌న్యూస్.. కొన్ని స్పెషాలిటీ మందులకు 100% అమెరికా టారిఫ్ నుంచి మినహాయింపు

ఈ కథనాలు విపరీతంగా వ్యాపించడంతో రష్యా ఆరోగ్య శాఖ, ప్రజారోగ్య పర్యవేక్షణ సంస్థ అయిన 'రోస్పోట్రెబ్నాడ్జోర్' తక్షణమే స్పందించాయి. డారియా మరణానికి ప్లేగు వ్యాధి కారణమని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆమె మరణాన్ని ప్రాథమికంగా "తెలియని కారణంతో వచ్చిన తీవ్రమైన న్యుమోనియా"గా నమోదు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షలలో లేదా ఆమె మృతదేహంలో ప్రమాదకర సూక్ష్మజీవుల ఆనవాళ్లు ఏవీ లభించలేదని సంస్థ వివరించింది. అంతేకాకుండా, ప్రయోగశాలలో టెస్ట్‌ట్యూబ్ పగిలిపోయిందనే ప్రచారంలో నిజం లేదని, ప్రాథమిక తనిఖీల్లో ల్యాబ్ భద్రతా వ్యవస్థల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేదా ప్రమాదాలు జరిగినట్లు ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు.

అయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా రష్యా ప్రభుత్వం అత్యంత కఠినమైన బయోసేఫ్టీ ప్రోటోకాల్స్‌ను అమలులోకి తెచ్చింది. డారియా షిపిలోవాతో ప్రత్యక్షంగా , పరోక్షంగా పరిచయం ఉన్న దాదాపు 200 మందికి పైగా వ్యక్తులను గుర్తించి వారిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచారు. అందులో కొందరిని ఆసుపత్రుల్లోని ప్రత్యేక క్వారంటైన్ వార్డుల్లో ఉంచి తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని కొన్ని ఆసుపత్రులతో పాటు సమీపంలోని ప్రముఖ అల్యూమినియం ప్లాంట్‌లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి తాత్కాలిక నిబంధనలను విధించారు. అయితే ఈ చర్యలన్నీ కేవలం ముందస్తు జాగ్రత్తలో భాగమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రష్యా చీఫ్ శానిటరీ డాక్టర్ అన్నా పోపోవా స్వయంగా ఇర్కుట్స్క్ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని నిసితంగా సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజారోగ్య పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉనప్పటికీ, ప్రయోగశాలలో ఏవైనా భద్రతా నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా లేదా విధుల నిర్వహణలో అలసత్వం జరిగిందా అనే కోణంలో క్రిమినల్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అనుమానితులందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచడం, ల్యాబ్ భద్రతా తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షల పూర్తి నివేదికలు , లాబొరేటరీ దర్యాప్తు ముగిసిన తర్వాత మాత్రమే ఆమె మరణానికి అసలు కారణం ఏంటనేది అధికారికంగా స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement