Taliban: తాలిబన్లు ఎంతటి క్రూరులంటే..మహిళలను చంపి ఆ శవంతో సెక్స్ చేస్తారు, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను వారి సుఖం కోసం పంపాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన అఫ్గనిస్తాన్ మహిళ
తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని అందుకే దేశం విడిచి పారిపోయి వచ్చానని అఫ్గనిస్తాన్ (Afghanistan) మహిళ ముస్కాన్ తెలిపారు.
Kabul, August 25: అఫ్ఘానిస్థాన్ ను కైవసం చేసుకున్న తాలిబన్ల ఆకృత్యాలు, దారుణాలపై అక్కడి నుంచి ఇండియాకు పారిపోయి వచ్చిన మహళి బయటి ప్రపంచానికి తెలిపింది. తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని అందుకే దేశం విడిచి పారిపోయి వచ్చానని అఫ్గనిస్తాన్ (Afghanistan) మహిళ ముస్కాన్ తెలిపారు. తాలిబన్లు క్రూరులని, మహిళలను చంపి ఆ శవాలతో కూడా సెక్స్ (Taliban rape gangs having sex with dead bodies) జరిపే కామాంధులని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లకు ఎవరైనా ఎదురుతిరిగితే వారిని చంపి అత్యాచారానికి (sex with dead bodies) పాల్పడతారంటే ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అఫ్గన్ తాలిబన్ల (Taliban) హస్తమగతమైన నేపథ్యంలో ఆమె భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఈ క్రమంలో తమ దేశంలోని భయానక పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వెల్లడించారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను పంపించాలని తాలిబన్ ఫైటర్లు కోరతారు. ఎవరైనా తమతో రావడానికి నిరాకరిస్తే (they hunt for female slaves) కాల్చి చంపేస్తారు. మృతదేహాలపై కూడా వాళ్లు లైంగికదాడికి పాల్పడతారు. ఒక మనిషి బతికుందా లేదా చచ్చిపోయిందా అన్న విషయాలతో వాళ్లకు సంబంధం ఉండదు. అక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఒక్క విషయం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగానికి వెళ్లే మహిళల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడినట్లే. ఒక్కసారి వార్నింగ్ ఇచ్చాక వినలేదంటే.. మరోసారి వార్నింగ్ కూడా ఉండదు. అంతం చేయడమే’’ అంటూ తాలిబన్ల అరాచకాల గురించి తెలిపారు. కాగా తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా తాలిబన్లు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. కో ఎడ్యుకేషన్ రద్దు చేయడం, వేశ్యా గృహాల్లో జంతువులను ఉంచడం ద్వారా తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మహిళలపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని ఆదేశించారు.