US Air Strikes in Syria: సిరియాపై మళ్లీ అమెరికా బాంబు దాడులు, ఇరాక్ మిలిటెంట్ గ్రూపు స్థావరాలపై వైమానిక దాడులు, పలు స్థావరాలు ధ్వంసం, 22 మంది మరణించారని తెలిపిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్
సిరియాపై మళ్లీ అమెరికా దాడులకు దిగింది. సిరియాలోని కొన్ని స్థావరాలపై అమెరికా దళాలు వైమానిక దాడులు (U.S. Air Strikes in Syria) చేయండంతో 22 మంది వరకు మరణించారు. ఇరాన్ మద్దతు కలిగిన ఇరాక్ మిలిటెంట్ గ్రూపు స్థావరాలపై గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా జరిపిన దాడిలో ఇరాకీ ఉగ్ర సంస్థకి చెందిన పలు స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 22 మంది మరణించారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ చెబుతోంది.
Washington, February 26: సిరియాపై మళ్లీ అమెరికా దాడులకు దిగింది. సిరియాలోని కొన్ని స్థావరాలపై అమెరికా దళాలు వైమానిక దాడులు (U.S. Air Strikes in Syria) చేయండంతో 22 మంది వరకు మరణించారు. ఇరాన్ మద్దతు కలిగిన ఇరాక్ మిలిటెంట్ గ్రూపు స్థావరాలపై గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా జరిపిన దాడిలో ఇరాకీ ఉగ్ర సంస్థకి చెందిన పలు స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 22 మంది మరణించారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ చెబుతోంది.
ఇటీవల ఇరాక్‌లోని అమెరికా దళాలపై మూడు వేర్వేరు రాకెట్ దాడులు జరిగాయి. దానికి ప్రతీకారంగా అమెరికా తాజా రాకెట్ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇచ్చిన ఆదేశాలతోనే ఇరాన్ మిలిటెంట్లపై దాడులు జరిగాయి. ఇటీవల ఇరాక్‌లోని ఇర్బిల్‌లో జరిగిన దాడికి షియా మిలిటెంట్లు కారణమని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యాలయంలో పెంటగాన్ ఈ తాజా దాడులకు పూనుకున్నది.
సిరియా-ఇరాక్ బోర్డర్‌లో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై దాడులు చేసినట్లు పెంటటాన్ అధికారులు తెలిపారు. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల ప్రకారం ఈస్ట్రన్ సిరియాలోని స్థావరాలపై దాడి చేసినట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. సిరియా నగరమైన బుకామల్ వద్ద ఇరాక్ నుంచి వస్తున్న మూడు ట్రక్కులపై దాడి జరిగింది. ఆ వైమానిక దాడుల్లో 22 మంది మృతిచెందినట్లు సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొన్నది. వైమానిక దాడిలో హషీద్ అల్ సాబీ దళ సభ్యులు మృతిచెందారు. ఆ దళానికి ఇరాన్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాక్ బలగాల అధికారి మాత్రం ఒక్కరే మరణించారని, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయని వెల్లడించారు.
ఫిబ్రవరి మొదట్లో ఇరాక్‌లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన రాకెట్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్టుగా అమెరికా వెల్లడించింది. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సైనిక చర్యలకు దిగడం ఇదే మొదటిసారి. సిరియా, ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న కతాబ్ హెజ్బుల్లా గ్రూపుకి చెందిన స్థావరాలకు మారణాయుధాలను తీసుకువెళుతున్న మూడు లారీలు అమెరికా దాడుల్లో ధ్వంసమయ్యాయి. హెజ్బుల్లా బ్రిగేడ్స్ అని కూడా ఈ గ్రూపును పిలుస్తుంటారు.
సిరియాలో వేటిని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగామో తమకు బాగా తెలుసునని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. మధ్య ప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల్ని మరింతగా విస్తరించి పట్టు పెంచుకోవడం కోసం బైడెన్ ఈ దాడులకు ఆదేశాలివ్వలేదని, ఇరాక్‌లో అమెరికా బలగాలకు మద్దతుగా ఉండడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ఆస్టిన్ స్పష్టం చేశారు. లెబనీస్ హెజ్బుల్లా ఉద్యమం నుంచి విడిపోయిన ఇరాకీ కతాబ్ గ్రూపు మిలిటెంట్లు గతంలో ఇరాక్‌లో అమెరికా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని పలు దాడులకు పాల్పడినట్టు అగ్రరాజ్యం చాలాసార్లు ఆరోపించింది.
(The above story first appeared on LatestLY on Feb 27, 2021 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

